Telugu moral stories in Telugu
బుద్ధిహీనులు | Telugu moral stories in Telugu
Telugu moral stories in Telugu
ఒకనాడు ఒకరైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగినా, వాళ్ళకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు. చిట్టచివరకు వాళ్ళు గుర్రాలవద్దకు వెళ్ళారు.
అక్కడ ఒక నల్లగుర్రం రైతుకు బాగానచ్చింది. కొడుకు గూడా ఒప్పుకొన్నమీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితోబాటుగా కొంతదూరం నడిచే సరికి వాళ్ళకి నీరసంవచ్చింది.
అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి యింటికి పోసాగారు. దారిలో, వాళ్ళని చూచి కొందరు “ఆహా! ఎంతచక్కని గుర్రము! కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది.
పోతుల్లాంటి యిద్దరు మనుషుల్ని అది మోయలేక పోతోంది కాబోలు” ‘అన్నారు. ఆ మాటలు విన్న తండ్రీ కొడుకులకు చాల సిగ్గనిపించింది.
కుమారుణ్ణి గుర్రంపై కూర్చోబెట్టి తాను ప్రక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడిజనం వీళ్ళని చూచి “కొడుకెంత దుర్మార్గుడో!
ముసలితండ్రి నడచివస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చొన్నాడు. ఎంతసిగ్గు చేటు!” అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు.
ఊరిచివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళనిచూచి “ముసలివాడెంత దుర్మార్గుడో! పాపం పసివాడు!
కొడుకును ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీచేస్తున్నాడు” అన్నారు. వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రంగి న వడసాగాడు.
వాళ్ళకు ఈ గుర్రంతో చాల అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకొంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవల్సి వచ్చింది.
వంతెనపైకి రాగానే యిద్దరూ కలసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత “హమ్మయ్య! ఈ గుర్రంపీడ వదిలింది” అనుకొని యిద్దరూ ఆనందంగా యింటికి చేరుకొన్నారు. వారికి సొమ్మునష్టపోయామనే చింతేలేదు.
నీతి :- చెప్పుడు మాటలు విని చెడిపోకు.
చిన్న సహాయం | Telugu moral stories in Telugu
Telugu moral stories in Telugu
రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది. ఇళ్ళన్నీ కూలిపోన డంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపో యారు.
అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ‘ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు’ అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని | రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
ఒకసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు, వంకలు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్క జంతువులు విలవిల్లాడాయి.
నీటిని వెతు క్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏను గులు రామాపురంలోని మంచి నీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కిందపడి నలిగిపోయాయి.
అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి “మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా అప్తులు, మిత్రులు మీ కాళ్ళ కింద నలిగి పోయారు.
మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు ” మాలో ఇంకా ఎందరు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి.
మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చిన ప్పుడు సహాయపడతాం” అని చెప్పింది. “మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం.
అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు” అన్నాయి. ఏను గులు అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరు కున్నాయి.
కొన్నాళ్ళ తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేట గాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు.
ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు.
వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏను గులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏను గుల విడుదలకు సహాయం చేశాయి. “ఎంత చిన్న నారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు” అని తెలుసుకున్నాయి.
నీవు నేర్పిన విద్య నీరజాక్ష
Telugu moral stories in Telugu
ఒక ఊర్లో ఒక బీదదంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఒక కొడుకుపుట్టాడు. వాడి పురుటి రోజుల్లోనే తల్లి చనిపోయింది. అందుచేత చిన్నప్పటినుండి దాని బాగోగులను తండ్రే చూసుకొనేవాడు.
ఏలోటూ రాకుండా. పెంచి పెద్దచేసి వానికి విద్యాబుద్ధులు నేర్పించాడు తండ్రి. ఏ చెడు అలవాట్లూ లేకుండా వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వానికొక పెద్ద ఉద్యోగం వచ్చింది.
వాడు కష్టపడి పనిచేసి అందరి మెప్పును పొందుతూ వేరే ఊర్లో ఉంటున్నాడు. కాని దానికి పల్లెటూళ్ళో నున్నతండ్రి అంటే పూర్తిగా యిష్టంలేకుండా పోయింది.
కొన్నినాళ్ళ తర్వాత మంచి కట్నంతో ఒకపట్నం పిల్ల వానికి భార్యగా వచ్చింది. మరి కొన్నాళ్ళకు వాళ్ళకొక చక్కని కొడుకు పుట్టాడు.
పల్లెటూళ్ళో వంటరిగా ఉండలేక ముసలివాడు పట్నంలోని తన కొడుకు దగ్గరకు చేరుకొన్నాడు. తన ముసలితండ్రివల్ల తన గౌరవంతగ్గి పోతుందని ఆ కొడుకు ఎంతోబాధ పడిపోయేవాడు.
ఆ ముసలివాణ్ణి దొడ్లోని ఒకపాకలో ఉంచి మిగిలిపోయిన, పాడైపోయిన పదార్థాల్ని అతనికి తినడానికి యిచ్చేవాడు. అతడు కట్టుకోవడానికి తన పాత బట్టల్ని యిస్తూండేవాడు.
చంటివాడు చిన్నప్పటినుండీ తాతగారితో చనువుగా ఉంటూ ఆయనతోనే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు. పదిసంవత్సరాల వయస్సునుండీ యింట్లోని పరిస్థితులన్నీ వాడికి అర్ధమౌతున్నాయి.
“పాపం! తాతగార్ని వీళ్ళు ఎంతో బాధపెడ్తున్నారు! ఆయన్ను ఒక ముష్టివానిలాగా చూస్తున్నారు” అనుకొని ఎంతో బాధపడుతుండేవాడు.
ఒకరోజున చలిఎక్కువగా ఉండి ముసలితాత వణకుతున్నాడని ఆ మనవడు తన తండ్రి రగ్గుని (కంబళిని) తీసుకెళ్ళి తాతకు యిద్దామనుకొంటున్నాడు.
ఈలోగా అక్కడికి వచ్చిన తండ్రి వాని ఉద్దేశ్యం తెలుసుకొని “అది నా కంబళీ! దాన్ని యివ్వవద్దు. ఇదిగో ఈ పాత గొంగళీని ” అన్నాడు. ఇంక తప్పనిసరై వాడు ఆపాత గొంగళీనే తాతకు యిచ్చి వచ్చాడు. కాని వాడి మనస్సుకు ఆపని నచ్చలేదు. చాలాసేపు బాధపడ్డాడు.
నిపుణ
Telugu moral stories in Telugu
ఎన్నో ఏళ్లుగా మహేష్, కిరణ్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. బాస్ మహేష్క సేల్స్ ఎక్జిక్యూటివ్ గా ప్రమోషన్ ఇచ్చాడు. కిరణ్ మాత్రం ఆ పాత ఉద్యోగం సేల్స్ రిప్రజెంటేటివ్గానే మిగిలాడు.
దాన్ని అవమానంగా భావించి కిరణ్ రిజైన్ చేసి, “సార్! కష్టపడి పనిచేసే మాలాంటి వారిని మీరు గుర్తించడంలేదు. మిమ్మల్ని పొగిడి, మీ చుట్టూ తిరిగేవారికే ప్రమోషన్స్ ఇస్తారు.
అని నేరారోపణ చేశాడు. నిజానికి కిరణ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని బాస్కు తెలుసు. కానీ తనకీ మహేష్కి ఉన్న తేడాని అతను గ్రహించాలని ఒక పని అప్పగించాడు.
కిరణ్! అలా బజారుకెళ్ళి పుచ్చకాయలున్నాయోమో చూసిరా” అని పంపాడు. తిరిగి వచ్చిన కిరణ్, “ఉన్నాయి సార్!” అన్నాడు.
“మరి వాటి ధర ఎంత?” అన్నాడు బాస్, కిరణ్ మళ్లీ మార్కెట్కు వెళ్ళి వచ్చి, “సార్! కే.జి. 15 రూపాయలు” అన్నాడు. కిరణి పక్కనే కూర్చోమని చెప్పి, బాస్ మహేష్ న్ను పిలిచీ, మార్కెట్లో పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకొని రమ్మన్నాడు.
మహేష్ తిరిగి వచ్చి, “సార్! ఒక్కడే ఒక్కడు వాటిని అమ్ముతున్నాడు. కె.జి. 15 రూపాయలట. 10 కె.జీలు కొంటే 130కి ఇస్తాడట.
అతని దగ్గర బల్లమీద 58, సంచుల్లో కలిపి దాదాపు 340 పుచ్చకాయలు ఉన్నాయి. అవి ఒక్కోటి 15 కేజీల బరువున్నాయి. వాటిని రెండురోజుల క్రితమే తెచ్చాడట. చాలా తాజాగా ఉన్నాయి.” అని చెప్పాడు.
కిరణ్ ఆ జవాబు విని తనకూ మహేష్కి గల తేడాను గుర్తించాడు. ఇక రిజైన్ చేయకుండా మహేష్నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకున్నాడు.
దుప్పి తెలివి!
Telugu moral stories in Telugu
అనగనగా ఓ అడవి. అందులో ఓ దుప్పి. ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ… చాలా దూరం వెళ్లింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికీ వర్షం తగ్గింది.
ఇక బయటకు వద్దాం… అనుకునే గుహవైపు వస్తున్న పెద్దపులి కనబడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది.
కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగి పోలేదు. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయొచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు.
వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో… ‘ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది.. నిశ్శబ్దంగా ఉండు.. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం.
ముందే చెబుతున్నా… దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికి తొంభైతొమ్మిది పులుల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే వంద అవుతాయి’ అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది.
పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది.
దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ‘ఎందుకు పరిగెడుతున్నావు?’ అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. ‘పదా… వెళ్లి చూద్దాం!’ అని అది తోడేలు. పులి భయం… భయంగానే ఒప్పుకుంది.
గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈ సారి తోడేలు, పెద్దపులి కనిపించాయి. మరో సారి గొంతు మార్చి పెద్దపులి వచ్చేలా లేదు కానీ…
ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్లి చూసొస్తా… మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈ రోజు మనం పులి. తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అది అంతే…
తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్త బోయింది. ఈ కంగారులో అది పెద్దపులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులికూడా ఉలిక్కిపడి… కిందపడింది.
వెంటనే పైకిలేచి ఈ సారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు ದಾನ್ನಿ అనుసరించింది. ‘బతుకు జీవుడా!’
అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడూ ఆ గుహ వైపు వెళ్లే సాహసం చేయలేదు.