Moral stories in Telugu with moral

కాకి అందం! Moral stories in Telugu with moral

Moral stories in Telugu with moral

ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి…

‘తెల్లగా ఎంత అందంగా ఉందీ హంస. దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు?!’ అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది.

‘నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపూ, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక!’ అంది హంస.

అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి… హంస అన్న మాటల్ని చెప్పింది. ‘అవును హంస చెప్పి నట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని.

కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని పించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో…!’ అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి.

అడవంతా తిరిగింది. కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దానివద్దకెళ్లి ‘పక్షుల న్నింటిలో అందమంటే నీదే.

మనుషులకీ నువ్వంటే ఎంతి ష్టమో!’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి ‘నా అందంవల్లనే ఇక్కడ బందీ అయ్యాను.

ఉన్నత వరకూ వేటగాళ్లకి భయ పడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక ‘కాకి కంటే స్వేచ్ఛా జీవి మరొకటి లేదు కదా!’ అనిపిస్తోంది.

ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు… ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా!” అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.

నిజమైన స్నేహితులు

Moral stories in Telugu with moral

శ్రీ కృష్ణుడు, సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి. చెంది, పెరిగి, సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే ‘ తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు.

చివరికి పిల్లల ఆకలిని’ ‘కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి. ‘సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా “ఇచ్చింది.

మిత్రుడి దగ్గరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వేళ్ళాడు.సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది.

ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి లోపలికి పంపించలేదు.

కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి, తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా.

అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా, సుధామ కాళ్ళు కడిగి, తన పక్కనే కూర్చోబెట్టుకుని, చిన్ననాటి మధురస్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు..

అంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడి కి తాను తెచ్చిన అటుకులు ఇవ్వవడానికి సిగ్గు పడి వెనక్కి దాచేసాడు సుధామ.

అది గమనించిన కృష్ణుడు, అడిగి మరీ చేతిలోంచి తీసుకుని, మూట విప్పి. తినసాగాడు.శ్రీకృష్ణుని ప్రేమకి, ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు.. సెలవు తీసుకుని తన ఊరు వచేసాడు.

వొచ్చేసరికి అతని గుడిసె పోయి. మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి, కళకళ లాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ.

నోరు తెరిచి. .ఏమీ చెప్పలేదు. సహాయం అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకుని. తనకి .ఏమి కావాలో ఇచ్చేసాడు. అదే నిజమైన స్నేహమంటే.

అని అనుకుని.. . మురిసిపోయాడు…. నీతి నిజమైన స్నేహితులకి అంతస్తు తో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.

కోపం తగ్గే మందు!

Moral stories in Telugu with moral

కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరకి రమణ అనే యువకుడు వచ్చాడు. . రాగానే ఆయన కాళ్లపైనపడి ‘అయ్యా! నాకు కోపం చాలా ఎక్కువ.

మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితోనూ ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తు పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, న్నారు. నేనేం చేయాలి?’ అని అడి గాడు.

అప్పుడు స్వామీజీ ‘నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది.

దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు. వెళ్లి తెచ్చుకో!’ అన్నాడు. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికె ళ్లాడు.

బక్కచిక్కిన ముసలి పులిదగ్గ రకెళ్లి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదుకానీ ‘నాకు’ వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను.

కాబట్టి నాకు ప్రతి రోజూ ఆహారం తెచ్చిపెడితే… గోరు ఇస్తాను!’ అని చెప్పింది. అప్పటి నుంచీ కేశవ ప్రతిరోజూ దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు.

రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్లు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరకి తీసుకునేవాడు.

ఓ రోజు పులి కేశవతో ‘నేను చని పోయే సమయం వచ్చింది. చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్లు!’ అని చెబుతూ కన్నుమూసింది.

కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ‘ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా!

అదే సానుభూతినీ ప్రేమనీ నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవా…! మనసులోపల ప్రేమా, జాలీ ఉంటే సరిపోదు. దాన్ని చూపాలి.

అలా చూపడం మొదలుపెడితే నీ కోపమూ తగుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు!’ అని చెప్పాడు. అప్పటి నుంచీ కేశవ ఎదు టివాళ్ల ఇబ్బందుల్నీ పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చు కున్నాడు… అందరి బంధువు అనిపించుకున్నాడు!

దొంగ చెప్పిన నీతి | Moral stories in Telugu with moral

Moral stories in Telugu with moral

Moral stories in Telugu with moral

మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. ” కానీ, దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేదికాదు.

నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను బానిసలా బత కాల్సి వస్తోంది’ అని ఎప్పుడూ అనుకునేది.

అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది. ఒక రోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢనిద్రలో ఉన్నాడు.

దొంగ చేతికం దిన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ, యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు.

తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో ‘అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పదీయండి’ అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ ‘నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?’ అన్నాడు.

అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా ‘కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్లు. జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను’ అని ప్రాధేయప డింది.

దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి, చిన్నగా నవ్వాడు. ‘నేను దొంగను. నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి.

నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు. అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు.

నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాతి నుంచీ అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది.

సోమరి సుబ్బయ్య

Moral stories in Telugu with moral

Moral stories in Telugu with moral

అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో అడవి ఉంటుంది. పిల్లలంతా ఆ అడవికి వెళ్లి కావాల్సిన పండ్లూ, కాయలూ కోసుకుని తినేవారు.

కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చు కుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు.

పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండటంవల్ల కోసుకోవటానికి చేతకాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరకో చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయాడు.

అంతలో అక్కడికి కోతులు గుంపు ఒకటి వచ్చింది. అత డిని చూసి… ‘పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు. మనం సాయం చేద్దాం’ అందొక కోతి. సరేనన్నాయి మిగిలిన కోతులు.

పెద్దవి చెట్టుమీదకు వెళ్లి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే, చిన్నవి వాటిని సంచిలో వేశాయి. తర్వాత అక్కణ్నుంచి వెళ్లిపోయాయి.

కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చి చూస్తే తన చుట్టూ, సంచినిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు.

కొన్ని తిని సంచితో పండ్లని తీసుకొని ఇంటికివెళ్లి జరిగింది చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు.

అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు. అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి.

సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో | కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య.

ఒక పిల్లకోతి దీన్ని గమనించి మిగతావాటికి చెప్పింది. అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై మీదకి దూకాయి. ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు.

కొంత దూరం వెళ్లాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతణ్ని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు.

‘దురాశ దుఃఖానికి చేటు’ అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: