Friendship moral stories in Telugu
1. ఏనుగు గర్వభంగం | Friendship moral stories in Telugu
Friendship moral stories in Telugu
ఒకసారి ఒక ఏనుగు అడవిలోంచి పోతూ ఒక చీమల పుట్టమీదకాలు వేసింది. వెంటనే ఆ చీమలన్నీ ఒక్కసారిగా “ఎవతెవే నీవు?
పెద్దశరీరం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉండక్కర్లేదా? మాపుట్టను ఎందుకిలా నాశనం చేశావు” అని అరిచాయి. దానికి ఆ ఏనుగు నవ్వుతూ “ఎవరే ఆ మాట్లాడేది?
నాకు కన్పించడమే లేదుగాని మాటలు మాత్రం విన్పిస్తున్నాయి-అంత చిన్న ప్రాణులు మీరు. పొగరుబోతుల్లారా! మీరు నన్ను ఎదిరిస్తారా?” అంది.
తర్వాత చీమలన్నీ కూడబలుక్కుని “ఎలాగైనా ఆ ఏనుగు పొగరు అణచాలి” అని ఒక ఆలోచనచేశాయి. వెంటనే అవి ఏనుగు కాళ్ళపైకి ఎక్కికుట్ట సాగాయి.
ఏనుగుచర్మం దళసరిగా ఉంటుంది కదా! దానికేమీ బాధకలగలేదు. అప్పుడొక తెలివైన ఎఱ్ఱచీమ “ఏనుగుకళ్ళు చాలసున్నితంగా ఉంటాయి.
అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది. మీరు కళ్ళవద్దకు వెళ్ళండి. నేను దాని చెవిలోకి వెళ్తాను” అంది. వెంటనే చీమలన్నీ దాని కళ్ళవద్దకు వెళ్ళి కుట్టసాగాయి.
బాధతో కళ్ళుమూసుకొని, ఏనుగు గుడ్డిదానిలాగ గంతులు వేయడం మొదలుపెట్టింది. ఏడుస్తోంది. అరుస్తోంది. చెవిలోనున్న చీమ దాన్ని ఒక్కసారికుట్టి” ఏం, ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణుల తడాఖా!
ఇప్పుడు చెప్పు-మాశక్తిగొప్పదా నీశక్తి గొప్పదా!” అంది. చీమలు కుట్టి కుట్టీ ఏనుగును గుడ్డిదాన్ని చేశాయి. దారితెలియక ఒకచెట్టును ఢీకొట్టి క్రిందపడి మూర్ఛబోయింది.
“అల్పులమని మమ్మల్ని యీసడించిన ఆ ఏనుగు గతి ఏమైందో చూడండి” అని చీమలన్నీ సంతోషంతో గంతులువేశాయి.
నీతి :- శక్తికన్నా యుక్తే గొప్పది
2. టోపీలవర్తకుడూ – కోతులు
Friendship moral stories in Telugu
వేసవికాలంలో ఒకరోజున ఒకటోపీల వర్తకుడు ఊరంతా తిరిగి కొన్నిటోపీలను అమ్ముకొన్నాడు. మిగిలిన టోపీల మూటతో వాడు ఆ ఊరి చివరనున్న ఒక చెట్టుక్రిందకు చేరాడు.
చెట్టునీడలో చల్లగా ఉంటుందని అక్కడ తలక్రింద మూట పెట్టుకొని పడుకొన్నాడు. ఇంతలో ఒక కోతులదండు ఆ చెట్టుమీదకు వచ్చింది.
వర్తకుని నెత్తిమీద టోపీ, అతని తలక్రింద ఏదోమూటా వానికి కన్పించాయి. మెల్లగా రెండుకోతులు దిగివచ్చి ఆ మూటను చెట్టుపైకి తీసుకొని పోయాయి.
అవి మూట చింపి చూస్తే అందులో రంగురంగుల టోపీలు ఉన్నాయి. క్రింద పడుకొన్నవాడొక టోపీ పెట్టుకొన్నాడు, అట్లాగే టోపీలను పెట్టుకొన్నవాళ్ళని కూడా పూర్వం అవిచూశాయి.
మనిషి ఏంచేస్తే, అదే చేయడాన్కి అవి ప్రయత్నిస్తాయి! వెంటనే ఒక్కొక్క కోతివచ్చి, తలొకటోపీని తీసుకొని తలపై పెట్టుకొని కొమ్మలపైన కూర్చున్నాయి ఏదో సభచేస్తున్నట్లుగా.. కొంతసేపటి తర్వాత ఆవర్తకునికి మెలకువ వచ్చింది.
చూస్తే తలక్రింద మూటలేదు. “అయ్యబాబోయ్! నాటోపీలమూటని ఎవరో ఎత్తుకొనిపోయారు” అనుకొంటూ దిక్కులుచూస్తూ, ఏడ్వడం మొదలుపెట్టాడు.
అడుగుదామనుకొంటే ఎవ్వరూ కన్పించడంలేదు. ఏదో చప్పుడు అయ్యిందిపైన. తలపైకెత్తి చూశాడు. చెట్టుమీద కోతులు ఒకదానిటోపీని మరొకటి మార్చుకొంటూ ఆనందంతో పరవశించిపోతున్నాయి.
కిచకిచమంటూ ఏదో మాట్లాడుకొంటున్నాయి. వాడు తనకోపాన్ని అణచుకోలేక గట్టిగా అరుస్తూ చంపేస్తానని చేత్తో బెదిరించాడు. కోతులు గూడా చేతులతో అట్లే చూపాయి.
క్రింద పడేసి తొక్కేస్తానని వర్తకుడు కాలితో నేలమీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలు పెట్టాయి. “ఇవి నేనేంచేస్తే అవిగూడా అదే చేస్తున్నాయి.
కాబట్టి ఒక చిన్న తమాషా చేస్తాను” అనుకొన్నాడు. వెంటనే “ఛీ! వెధవ కోతుల్లారా! యీ టోపీని కూడా పట్టుకొని పొండి” అని తనటోపీని నేలకేసి కొట్టాడు.
వెంటనే కోతులన్నీ “ఊ!ఊ!ఊ!” అంటూ టోపీలన్నీ నేలమీదికి విసిరేశా ఆ టోపీలను అన్నిటినీ ఏరుకొని మూటగట్టుకొని గబగబా అక్కడినుండి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు.
నీతి :- శక్తికంటే యుక్తే గొప్పది.
3. ఫలించని కుట్ర | Friendship moral stories in Telugu
Friendship moral stories in Telugu
జయపురాన్ని పరిపాలించే ధర్మనందన మహా రాజుగారి మంత్రి వర్గంలో సుమంతుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. మహారాజు గారికి చక్కటి సలహాలు ఇచ్చేవాడు.
మహారాజు గారికి అతనంటే అభి . ఇది చూసి ఓర్వలేక పోయారు. మిగతా మంత్రులు ఎలాగైనా సుమంతుడిని మంత్రి వర్గం నుండి తప్పించాలని ఒక పధకం పన్నారు.
అందరూ కలసి మహారాణి గారి తమ్ముడి దగ్గరికి వెళ్లి, “నీ అంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోక పోవడం మాకు చాలా బాధగా ఉంది.
నుమం తుడి కన్నా నువ్వు ఎందులో తక్కువ? అసలు నువ్వే సుమంతుడి కన్నా చాలా తెలివైన వాడివి. అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక” అని చెప్పారు.
దీంతో మహా రాణి గారి దగ్గరికి వెళ్లి, తనను అతడు సుమం తుడి స్థానంలో మంత్రిని చేయమని కోరాడు. మహారాణి ఈ విషయాన్ని మహారాజుతో చెప్పింది.
దానికి మహారాజు అంగీకరించలేదు. ఏ తప్పు లేకుండా సుమంతుడిని తొలగించలేన న్నాడు. అప్పుడు మహారాణి, “అయితే నేనొక ఉపాయం చెబుతాను వినండి.
మీరు రేపు ఉద్యా నవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి సుమంతుడితో నన్ను మీ దగ్గరికి పిలుచుకు రమ్మని చెప్పండి.
నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి. అతను ఎంత పిలిచినా నేను రాను. దీంతో అతనిని తొలగించి మా తమ్ముడిని అతని స్థానంలో నియమించవచ్చు” అని ఒక కుటిల పధకం పన్నింది మహారాణి.
మహారాజుకు ఇది నచ్చక పోయినా మహారాణి మాటను కాదనలేక పోయాడు. మరుసటి సాయంత్రం మహారాణి చెప్పినట్లే చేస్తూ, “వెళ్లి మహారాణిని పిలుచు కురా! ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు.
లేక పోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను” అని కోపంగా చెప్పాడు మహారాజు. ఒక నమ్మక స్తుడి ద్వారా సుమంతుడికి మహారాణి పధకం తెలిసిపోయింది.
సుమంతుడు మహారాణి దగ్గ రికి వెళ్లి, మహారాజు గారు పిలుచుకు రమ్మన్నా రని చెప్పకుండా, కుశల ప్రశ్నలు అడగసాగాడు.
కాసేపటికి ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించాడు. సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ, “అయ్యో! అలాగా! మహారాణి గారు దుర్మార్గపు పనులు చేయమన్నారని మహారాజు గారికి కోపం వచ్చిందా?!
దీంతో అతను వేరే పెళ్లి చేసుకొని కొత్త రాణిని తెస్తానన్నారా?” అని అన్నాడు. So పరుగున మహారాజు గారి దగ్గరికి వెళ్లి, అతని కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంది.
మీరు చెప్పినట్లే చేశాను మహారాజా! అని అంటూ సుమంతుడు అక్కడి నుండి వెళ్లిపో యాడు. “సుమంతుడు నీతో ఏం చెప్పాడు?” అని మహారాజు గారు అడుగగా, మహారాణి గారు జరిగినదంతా వివరించారు.
సుమంతుడి తెలి వికి మహారాజు గారు మనసులోనే అభినందిం తన పధకం బెడిసికొట్టి, తనకే ఆపద చారు. వచ్చిందని మహారాణి భయపడింది. పరుగు
4. అసలైన అన్నదమ్ములు
Friendship moral stories in Telugu
చిలకలపాలెం అనే ఊళ్లో రామయ్య. కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు.
పెళ్లిళ్లయ్యి, తల్లి దండ్రులు చనిపో యాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేక పోయినా వేరు వేరు కాపురాలు పెట్టుకు న్నారు. ఉన్నపొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయ సాగారు.
అన్నయ్యకు ఇబ్బందులు పడతాడేమో…’ అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపుకొట్టులో పోసేవాడు కృష్ణయ్య, రామయ్యకూ తమ్ముడంటే అంతే ప్రేమ.
అందుకే ‘మేము ఇద్దరమే ఉంటాం. తమ్ముడికి ముగ్గురు పిల్లలు. వాళ్లు చేతికొచ్చిం దాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో’ అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు.
అలా ఏళ్లు గడిచాయి. ఒక రోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురు పడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యా లకు గురయ్యారు.
తన తమ్ముడి గొప్పదనం గురించి అన్నా, అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడూ ఊళ్లో వాళ్లకు చెప్పడంతో అన్నాదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యల్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరివాళ్లంతా. పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోకపోతే
5. మాయా టోపీలు | Friendship moral stories in Telugu
Friendship moral stories in Telugu
ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పదిమంది పుణ్యస్నానానికని వెళ్లారు. ఎవరికీ ఈతరాకపోవడం వల్ల ఒకరిచేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు.
పైకి లేవగానే ‘అరెరె! చేతులు విడిపోయాయే… మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు. ఓసారి లెక్కపెడదాం!’ అన్నాడు శిష్యుల్లో పెద్ద వాడు.
వెంటనే ఒకటీ, రెండూ, మూడూ… అని లెక్కపెడితే తొమ్మిది మంది లెక్కతేలారు. అదిచూసి అతని పక్కవాడు ‘మీకస్సలు లెక్కలే రావు. నేను లెక్కపెడతా చూడండీ..’
అని మళ్లీ మొదలు పెట్టాడు. అప్పుడూ తొమ్మిది ఉన్నారు. మూడో అతనూ, నాలుగో అతనూ లెక్క పెట్టినా ఇదే తంతు! అప్పటికే ‘మనవాళ్లలో ఎవరో గోదార్లో కలిసిపోయారు’ అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు.
వీళ్ల వాలకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడూ తనని తప్ప మిగతా వాళ్లందరినీ లెక్కపెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకు న్నాడు.
వాళ్లదగ్గరకెళ్లి ‘స్వాములూ! మీ లెక్కలో తప్పుంది..’ అని చెప్పబోయేంతలోనే ‘మూర్ఖుడా… మేం ఎవరనుకున్నావ్? పరమా నందయ్య శిష్యులం! అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది. పో..పో!’ అంటూ తరిమేశారు.
అక్కణ్ణుంచి వెళ్లబోతున్న వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే ‘అయ్యల్లారా! నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు… మాయా టోపీలు.
వీటిని పెట్టుకుని ఆ టోపీలని మాత్రమే లెక్కపెట్టి చూడండి… తప్పి పోయిన వ్యక్తి వచ్చేస్తాడు!’ అన్నాడు. ‘సరే… ఇలా తే!’ అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్కపెట్టారు.
పది టోపీలు లెక్కతేలాయి! మరో ఇద్దరు లెక్కపెట్టినా అంతే! ‘అరె… అద్భుతం సుమీ!’ అనుకున్నారందరూ. ‘భలే టోపీలోయ్! వీటి ధర ఎంత?’ అని అడిగాడు ఒక శిష్యుడు.
మామూలుకంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినాసరే అంత సొమ్ము ఇచ్చి, వాటిని కొనుక్కున్నారు. ‘మన ఊరు వెళ్లేదాకా ఎవరూ వాటిని తీయకండి.
లేకుంటే తప్పిపోతారు!’ అనుకుంటూ వాళ్లు వెళ్లడం చూసి… టోపీలమ్మే వ్యక్తి పడీపడీ నవ్వుకున్నాడు!
6. కష్టానికి గుర్తింపు
Friendship moral stories in Telugu
రంగాపురం అనే ఊళ్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా చేసిపెట్టి, వాళ్లిచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనయినా చాలా శ్రద్ధగా, నిజాయతీగా చేస్తాడని అతడికి పేరు.
ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగు లేయమనీ అందుకు యాభైరూపాయలు ఇస్తా ననీ చెప్పాడు.
గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తిచేయడానికి సిద్ధమై… జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్లాడు.
అయితే రంగులు వేసేందుకు పడవ లోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు.
సాయంత్రానికి పని పూర్తి అయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు.
అదే రోజు ఊరినుంచి తిరిగొచ్చిన జమీందారు నౌకరుకి ఈ విషయం తెలిసి కంగారుపడుతూ జమీందారు దగ్గరకు వెళ్లి… ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు.
దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబసభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్లు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు.
విషయం అర్ధమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి… చెప్పినదానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ ‘రంగులేయమని చెబితే… రంధ్రాన్ని కూడా పూడ్చావు.
నీ మేలు మర్చిపోలేను. నీవల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు’ అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్లోవాళ్లంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు.
7. శివయ్య కోరిక | Friendship moral stories in Telugu
Friendship moral stories in Telugu
రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్లు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, శివ య్యకు పొరుగింటి నుంచి కమ్మని నేతి గారెల వాసన వచ్చింది.
నోట్లో నీళ్లూరుతుం డగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి, భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, ‘నాకు నేతిగారెలు తినాలని ఉంది.
అంటూ సంక టిని దూరంగా నెట్టాడు. ‘మనమేమన్న శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశే,’ అంటూ నొక్కింది గంగమ్మ, చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు.
ఆ సంవత్సరం జమీందారు, తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసు కుంటున్నాడు.
అపరకర్మలు పూర్తి అయి పోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డిం చసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది.
తన భార్యని పెరట్లోకి పిలిచి, ‘ఏమేవ్! శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తు న్నారు. సాయంత్రానికి కొన్నయినా మిగు లుతాయి కదా. ఈ రోజుకి నేతి గారెలు తినే యోగం వచ్చిం దని సంబరపడిపోయాడు.
బ్రాహ్మణుల భోజనం అయిపోయాక, కొన్ని పిండివంటలు, గారెలు మిగిలిపో యాయి. వాటిని ఏమి చేద్దామని అను కుంటుండగా,
అయ్యా, శ్రాద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే, దగ్గర్లోని చెరువులో వదిలేయండి. పితృ దేవతలకు చేరుకుంటాయి,’ అన్నాడు బ్రాహ్మణుడు.
8. పిసినారి రుద్రయ్య
Friendship moral stories in Telugu
భీముని పట్నంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడూ ‘ఇంకా ఎక్కువ డబ్బులు సంపా దించడం ఎలా?’ అని ఆలోచిస్తూ ఉండేవాడు.
అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా. తనదేనని భావించేవాడు రుద్రయ్య.
ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారినపోతూ, ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు.
ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి, “ఈ చెట్టు నాది, దాని కింద కూర్చోడా నికి వీల్లేదు” అన్నాడు. ఆ ఊరివారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు.
అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది ఇప్పుడే. రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య. అతనితో “నీ చెట్టు నీడను నేను కొనదలచుకున్నాను, అమ్ముతావా?” అని అడిగాడు.
నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందించాడు. డబ్బులు తీసుకుని నీడను ఎప్పు డైనా వాడుకోవచ్చని అనుమతించాడు.
సాంబయ్య రోజూ తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలు పెట్టాడు. తన ఆవులను, మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలు పెట్టాడు.
సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో, కిటికీ గుండా ఇంటి లోపల కూడా. పడేది.
సాంబయ్య తన ఆవును, మేకలను, స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలు పెట్టాడు. నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతణ్ణి ఏమీ అనలేకపోయాడు.
ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది. రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలా మంది వేరే ఊరు నుంచి వచ్చారు.
కథ రుద్రయ్య “మా ఇంట్లో వేడుక జరుగు తోంది. ఇక్కడికి నువ్వు ఎందుక చ్చావు? వెళ్లు” అన్నాడు. సాంబయ్య “ఈ నీడ నాది. నువ్వే నాకు అమ్మావు, అడెక్కడుంటే అక్కడికి వెళ్లే హక్కు నాకుంది” అన్నాడు.
రుద్రయ్య స్నేహి తులు, చుట్టాలు అతను నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్లలో వాళ్లు మాట్లా డుకొని నవ్వడం మొదలుపెట్టారు.
సాంబయ్యకు అవమానంగా అనిపించింది. తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది. బుద్ధి తెచ్చుకుని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు.
9. అల్పులతో సహవాసం అనర్థం
Friendship moral stories in Telugu
ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావిచెట్టు ఉంది. దాని మీద ఒక కాకి, ఒక హంస నివసి స్తున్నాయి. కాకిది దుష్టస్వభావం
అల్ప బుద్ధి అని తెలిసి కూడా పొరుగున ఉం టోంది కదా అని దాంతో స్నేహంగానే ఉండసాగింది హంస. ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు.
ఎంత ప్రయత్నించినా ఏమీ |దొరకకపోవడంతో వెనుదిరిగి పోతూ. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు.
అలసిపోయి ఉండటంతో వేటగాడికి వెంటనే నిద్రప ట్టేసింది. అది వేసవి కాలం, గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది.
మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది.
హంస చేస్తున్న పరోప కారం చూసి నవ్వింది. “వాడు వేట గాడు! మనల్ని బాణాలతో వేటాడ తాడు. వాడికి సేవ చేస్తున్నావు. ఎంత పిచ్చిదానివి” అని ఎగ తాళి చేసింది.
అంతటితో ఆగ కుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసి, తలమీద తన్ని ఎగిరిపోయింది. దాంతో వేటగాడికి నిద్రా భంగం కలిగింది.
ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు. కోపం వచ్చింది. వెంటనే చూశాడు. హంస తప్ప అక్కడ మరే ప్రాణీ కనిపించ లేదు. తన మీద హంస రెట్ట వేసిందనుకు న్నాడు.
వెంటనే తన బాణాన్ని హంసకు గురి చూసి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస చనిపో యింది. వేటగాడు దానిని తీసు కుని ఇంటికి వెళ్లిపోయాడు.
నీతి: అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది.
10. పరిష్కారం
Friendship moral stories in Telugu
రామవరంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతడు జీవితంలో చాలా కష్టపడి పైకివచ్చాడు. తన ఎదుగుదలకు కారణం గురువు శ్రీనివాసశాస్త్రి అని అందరితో చెప్పేవాడు.
కృష్ణయ్య వృద్ధుడయ్యాక తన కొడుకులిద్దరినీ పిలిచి గురువుగారి సలహాలతో హాయిగా బతకండని చెప్పాడు. కృష్ణయ్య చనిపోయాక అతడి ఇద్దరు కొడుకులూ గురువు దగ్గరకు వెళ్లారు.
ఆయన ఇద్దరికీ రెండు చీటీలిచ్చి… ‘మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నపుడు మాత్రమే వీటిని తెరిచి చూడండి. వీటిలోని మంత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది’ అని చెప్పి చీటీల్ని చేతిలో పెట్టాడు.
పెద్దవాడు తన వాటాగా వచ్చిన పొలం సాగుచేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినపుడు గురువు ఇచ్చిన చీటీ తెరిచి చూడాలని అనుకునేవాడు.
కానీ అది ఒక్కసారికే ఉపయోగపడుతుందన్న మాట గుర్తొచ్చి ఆ ఆలోచన మానుకునేవాడు. సమస్యను తన శక్తిమేర పరిష్కరించు కునేవాడు. రెండోవాడు మాత్రం ఓసారి చిన్న సమస్యేదో రావడంతో గురువు ఇ చీటీని తెరిచి చూశాడు.
నీది చాలా చిన్న సమస్య త్వరలోనే తీరిపోతుంది’ అని దాన్లో రాసుంది. ఆ ధీమాతో ధైర్యం తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆ సమస్యనుంచి బయటపడ్డాడు.
ఆ తర్వాత మళ్లీ మళ్లీ అతడికి సమస్యలు వచ్చాయి. వాటికి పరిష్కారం తెలియక నిత్యం ఇబ్బందిపడేవాడు. పెద్దవాడు మాత్రం జీవితంలో ఎప్పుడూ చీటీ తెరవకుండానే
అవసరమైతే చీటి ఉందన్న ధీమాతో సమస్యలన్నీ తనకుతానుగా పరిష్కరించుకొంటూ సంతోషంగా జీవించాడు.