Moral Stories for Kids in Telugu
1. పేరు లేని పక్షి | Moral Stories for Kids in Telugu
Moral Stories for Kids in Telugu
ఒక అడవిలో రకరకాల పక్షులుండేవి. అవన్నీ ఒక రోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. “ఎవరు అంద రికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు” అని నిర్ణయించాయి.
ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటి కన్నా గద్ద చాలా పైకి ఎగి రింది.
అన్ని పక్షులు “గద్దే రాజు” అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద రెక్కలలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది.
గద్ద అప్ప టికే ఆయాస పడటం వల్ల ఎగరలేకపోయింది. పేరు లేని పక్షి “నేనే రాజు, నేనే రాజు” అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి “ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు” అన్నాయి.
బాతు నీటిలోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది అనుకునే సరికి పేరు లేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్ళి “నేనే గెలిచా, నేనే రాజుని” అనడం మొదలుపెట్టింది.
మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబను కాపలాగా పెట్టారు. గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది కాని ఒక్కక్షణం కునుకు పట్టింది.
అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్ల గూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు!
2. హితవు | Moral Stories for Kids in Telugu
Moral Stories for Kids in Telugu
ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది.
నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరుగెత్తాయి.
తీరా అక్కడికి వెళ్ళి. చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరుగెత్తాయి.
ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. “నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది.” దీనంగా అది ఒక కోతి.
“ఏం చేద్దాం… నీళ్ళు కనబడుతు అందటం లేదు. న్నాయి. ఇదేమి మాయో…” అంది మరొక కోతి పొద ఒక కుందేలు నివాసం ఉంది. ఆ కుందేలు జరిగినదంతా చూసింది.
కోతులకు సహాయం చేయా లని వచ్చి వాటి ముందు నిలబడింది. “ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చు కోండి” అని చెప్పింది.
ఇది విని కోతు లకు చాలా కోపం వచ్చింది. “మేం తెలివితక్కువవాళ్ళమా?”. అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. “నేను చెప్పేది నిజం.
నా మాటలు నమ్మండి”. భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును. బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.
నీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.
3. రాజుగారు
Moral Stories for Kids in Telugu
గొల్లపిల్లవాడు ఒకనాడొక రాజుగారు అడవికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు వేటాడి. అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టునీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారు.
ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కన్పించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో మేళవించి చక్కని చిత్రం గీయాలనుకొన్నారు.
వెంటనే వెళ్ళి గుర్రానికి వ్రేలాడుతున్న సంచీనుండి చిత్రలేఖనానికి కావల్సిన సామాన్ల నన్నిటినీ తెచ్చుకొని చిత్రాన్ని తయారుచేశారు.
దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్నిప్రక్కలనుండి చూచి ఆనందించాలని తలచి, మొదట కుడిప్రక్కకు, తర్వాత ఎడమ ప్రక్కకు, మరలా ఎదుటివైపునకు వెళ్ళి చూస్తున్నారు.
కొంచెం కొంచెం వెనుకకు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడసాగారు. కాని ఆయన వెనుకనున్నది కొండకొన. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం.
కాని ఆయన అది గమనించడం లేదు. ఈ విషయాన్ని ఆ దారినపోతున్న ఒక గొల్లపిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనవాడు. “అయ్యో! రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారు.
ఎట్లాగైనా ఆయన్ని రక్షించాలి” అనుకొన్నాడు. ఒకవేళ కేకవేసి చెప్పుదామంటే ఆయన కంగారుపడి లోయలోకి తూలిపడవచ్చు. అందుచేత వానికొక ఉపాయం తట్టింది.
వాడు గబగబా చిత్రాన్ని వ్రేలాడదీసిన కొయ్యవద్దకు వెళ్ళి చిత్రాన్ని పుటుక్కున చింపివేశాడు. రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప ‘చెళ్ళు’ మనిపించారు.
తర్వాత ‘ఎందుకిట్లా చేశావని’ అడిగారు. “మీరు కొండకొనమీద నిలబడి ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కువేస్తే మీరు లోయలోపడి పోవడం ఖాయం.
అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేనీ పనిచేశాను” అని చెప్పాడు వాడు. రాజుగారు ఒకసారి వెనుకకు చూచి “ఔను! నిజమే!” అని తమతప్పు తెలిసికొన్నారు.
ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతోబాటుగా తన రాజధానికి తీసుకొనిపోయి, అచ్చట వానికి విద్యాబుద్ధులు నేర్పించారు. తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలితేటలతో పెద్దవాడై రాజుగారి ముఖ్యమంత్రి అయ్యాడు.
నీతి: సమయానికి తెలివి ఉంటే ఆపదలు రావు
4. చక్కబడిన కొడుకు
ఒక ఊర్లో ఒకరైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు.
చిన్నప్పటి నుండీ అతిగారంచేసి పెంచడంచేత వాడు వట్టి పోకిరివాడుగా తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బును వృథా చేసేవాడు. చదువు అబ్బలేదు.
కాని చెడుతిరుగుళ్ళు మాత్రం అలవడ్డాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తనకొడుకును దగ్గరకు పిలిచి “బాబూ! నేను చనిపోయిన తర్వాత యీ ఆస్థి అంతా నీదే ఔతుంది.
కాని ఈ ఆస్థిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడ్తున్నాను. కనుక నీవుగూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు. వెంటనే ఆస్తినంతా నీకిచ్చి వేస్తాను” అన్నాడు.
“సరే! అట్లే చేస్తాను” అన్నాడు కొడుకు. ఆరోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్యలు లేనివాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పనిదొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు.
మొదటిరోజు వానికి 20రూ.లు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్ళి తండ్రికి యిచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్ళి నూతిలోనే వేశాడు.
నాలుగు రోజులు అట్లా పడవేసిన తర్వాత ఐదో రోజున | తండ్రి డబ్బును నూతిలోపడవేస్తూంటే అడ్డుకొని “అదేంటి నాన్నా! నేను ఎంతోకష్టపడి మూటలు మోసి సంపాదించిన నాకష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు?”
అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు, కొడుకు వీపు చరుస్తూ “ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపాదన నీళ్ళపాలౌతోందని బాధపడిపోతున్నావు.
నా సంపాదనను నీవు పాడుచేసినప్పుడు నే నెంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పడానికే నేను అట్లాచేశాను. డబ్బు సంపాదించడమే కష్టం – ఖర్చు చేయడం బహుతేలిక!
ఈ విషయం నీకు యిప్పుడు అర్థమైందని అనుకొంటున్నాను!” అన్నాడు. తనతప్పు తెలిసికొన్నాడు కొడుకు. తన్ను క్షమించవలసిందని తండ్రినికోరి అప్పటినుండీ దూబరాగా ఖర్చుచేయడంమాని, పొదుపరి అయ్యాడు.
నీతి :- పొదుపు చేసి ఆనందంగా జీవించు.
5. తోట నాయకుడు
చిన్ని, బంటి ఒకే బళ్లో ఆరో తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పజెప్పిన ప్రతి పనీ జాగ్రత్తగా చేసేది. కానీ బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు.
తన పనులు బాగానే చేసుకున్నా, పక్కవారి పనులు చెడగొట్టి సరదాపడేవాడు. ఒకరోజు బళ్లో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు.
పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. చిన్ని, బంటి కూడా వాళ్ల మొక్కలు నాటారు. బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని మొక్క వైపు చూశాడు.
చిన్ని అటు తిరగ్గానే ఆ మొక్క పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. పాపం చిన్ని చిన్నబోయింది. అలా చేసింది బంటి అని తెలుసు.
వెంటనే మాస్టారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. అంతే కాదు, ఒక ఉపాయమూ చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లలని వరసలో నిల్చోబెట్టి ఇలా చెప్పారు.. “పిల్లలూ, మన బడి తోటకు ఒక నాయకుణ్ని ఎన్నుకోవాలి.
మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి. బంటీ, ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు.
సరేనా. ఇక ఈ తోట బాధ్యత నీదే” అన్నారు. ఉన్నపళంగా మాస్టారు తనని నాయకుణ్ని చెయ్యడంతో బంటి పొంగిపోయాడు.
వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసిన చిన్ని మొక్కను తనే గబగబా నాటేసి “చిన్నీ, మొక్కని జాగ్రత్తగా చూడు” అన్నాడు.
తన పథకం పారినందుకు, మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారి వైపు చూసి నవ్వింది చిన్ని.