New moral stories in Telugu
1. ఘటన | New moral stories in Telugu
New moral stories in Telugu
చాలా కాలంగా కరిముల్లా మోటార్ మెకానిక్ షెడ్డులో పని చేస్తున్నాడు. అక్కడే మంచి మెకానిక్ గా ఎదిగాడు. జీత రోజుకి వంద రూపాయలు తీసుకుంటున్నాడు.
అబ్దుల్లా పెళ్ళిచేసుకుని మొదలు పెట్టాడు. జీతం సరి పోవడంలేదు. దాంతో తన యజమాని కరిముల్లాని రోజు వారీ జీతం, బేటా పెంచమని కోరాడు.
కుర్రాళ్ళతో కరిముల్లా సాధ్యమైనంత ఎక్కువ పని చేయించుకుని పా రెండ్రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే రకం. దాంతో అబ్ధుల్లా జీతం పెంచ డానికి ఏమాత్రం అంగీకరించ లేదు సరికదా
“ఈ వందరూ కొత్తకాపురం పాయలే నీకు ఎక్కువరా! అంటూ కసురుకు న్నాడు. అబ్దుల్లా ఈ విషయం భార్యతో చెప్పి బాధపడ్డాడు. అతని భార్య రజియా కాస్తో కూస్తో చదువుకు న్నది, తెలివైంది.
ఆ రోజు నుంచి భర్తని కరిముల్లా షెడ్లో పనికి వెళ్ళొద్దని లో చెప్పింది. తన దగ్గరున్న కాస్త బంగారం అమ్మించి, భర్తతో మెకానిక్ సామాన్లు కొనిపించి నెల తిరక్కుండానే చిన్నపాటి మెకానిక్ షెడ్ పెట్టించే సింది.
అ స్వంతగా పని చేసుకుంటూ రోజుకి రెండొందలు సంపా దిస్తున్నాడు. ఓ పాతిక రూపాయలు జీతం పెంచితే అబ్దుల్లా తనదగ్గరే పడుండేవాడు, మంచి మెకానిక్కుని కోల్పో యానని కరిముల్లా విలవి.. ల్లాడిపోయాడు. ఏదైనా ఒక ఘటన జీవితాన్నే మార్చేస్తుం దని గ్రహించాడు అబ్దుల్లా.
2. అంతర్మథనం
New moral stories in Telugu
“ఒరేయ్! నాయనా, ఎక్కడికిరా ఇలా మోసుకుపోతున్నారు. ఇదేంటి? స్మశానంలో ఇలా శవాల మధ్య పారేసిపోతున్నారు.”
“ష్ మాట్లాడకు.. నువ్వు చచ్చిపోతున్నావని నీ స్నేహితుడు రాజారాం ఫోన్ చేస్తే నిజమే అనుకుని నేను అమెరికానించీ, తమ్ముడు ముంబైనించి వచ్చాం.
నువ్వు చూస్తే ఇప్పుడు ప్పిడే పోయేట్టు కనిపించడంలేదు. “ఎన్నాళ్లిలా మేం సెలవు పెట్టుకుని, మా పనులు మానుకుని నీతో వుంటాం.
ఇప్పుడు కాకపో యినా మరో రోజయినా చివరికి నువ్వు చేరుకోవా ల్సిన చోటిదే కదా” “ఒరేయ్ నాయనలారా! చలితో గడ్డకట్టుకు పోతున్నానురా.
ఒరేయ్! ఒరేయ్! నన్ను వది లిపోకండిరా” . “అబ్బబ్బ! ఏమిటండీ మీ కలవరింతలు. అసలు మీ కేమయింది?” రివెన్యూ డిపార్ట్మెం ట్ వున్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వినాయకరావుని కుదిపేసింది ఆయన భార్య కాంతమ్మ.
“ఏమిటే ఇది కలా! నిజమే అనుకున్నాను. బాబోయ్..” ఆయన ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. తాము నలుగురు కొడుకులూ వున్నత స్థానాల్లో వుండీ, అనాథప్రేతంగా పల్లెలో వది లేసిన అతని తల్లి గుర్తుకొచ్చింది.
చివరిదశలో తన ఇద్దరు కొడుకులూ తనని కూడా అలానే వదిలేస్తే.. అనుకున్న వినాయకరావు ఒక్కసా రిగా వణికిపోయాడు.
3. ఇచ్చి పుచ్చుకోవడం | New moral stories in Telugu
New moral stories in Telugu
ఆఫీసు నుంచి తిరిగొచ్చిన శ్రీకాంత్ దుస్తులు మార్చుకుంటుండగా తను తొడు క్కున్న బనియను చాలాచోట్ల చిరిగిపోయి కనిపించింది.
పిసి నారితనంతో ఇంతకాలం నెట్టు కొచ్చాడు. ఇప్పుడు కొత్తబని కొనాలని నిశ్చయాని కొచ్చాడు. క్లాక్ టవర్ దగ్గరున్న కొట్టు కెళ్ళి ఇరవై రూపాయల్లో చౌక బారు బనియను కొన్నాడు. దారి లో చూడాలనిపించి, బని యన్ను కవర్లోంచి తీశాడు.
అందులో రెండు కనిపించాయి. షాపువాడు పొరపాటున రెండు బనియన్లు పెట్టేశాడు. శ్రీకాంత్ దీర్ఘాలోచనలో పడ్డాడు. మనసు సంబరపడింది- నయమే, ఒకటికి రెండొ చ్చాయి.
అంతరాత్మ మాత్రం హెచ్చ రించింది. ‘ఈ జన్మలో ఒకవేళ దుకాణదారుని ఇరవై రూపాయలు ముంచితే, వచ్చే జన్మలో అతని రుణం తీర్చుకోవడానికి ఏం పాట్లు పడాల్సివ స్తుందో? ఏదోరూపంగా బదులు తీర్చాల్సిందే’ అని.
బనియను ఆ భయం కలగ్గానే శ్రీకాంత్ పొరపాటున వచ్చిన రెండో తిరిగిచ్చేయాలని వెనుదిరిగాడు. అయితే, కొంచెం దూరం వెళ్ల గానే, శ్రీకాంత్ మనసులో మరో ఆలోచన కలిగింది.
బహుశా ఆ దుకాణుదారే గత జన్మలో నా దగ్గర ఇరవై రూపాయలు ఎలాగో కొట్టేసి ఉంటాడు. ఆ లెక్క సరిపోవడా నికి దేవుడు ఇప్పుడు వాడితో ఈ పొరపాటు చేయించిన ట్టుంది.
ఇది పూర్వజన్మ రుణమే కావచ్చు. ఇప్పుడు తీరుంటుంది. ఇందులో ఆందోళన చెందాల్సిన.. ఆ తలంపు మనసులో మెదలగానే నిశ్చిం తగా ఇంటికి తిరుగుముఖం పట్టాడు.
4. పరివర్తన
New moral stories in Telugu
అనగనగా ఒక ఊరిలో శేషు అనే దొంగ ఉండే వాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైని కుల కళ్లు కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటు న్నారో వినాలనే కుతూహలం కలిగింది.
“మహారాజా! మన కుమార్తె | వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి” అని మహారాణి అడిగింది.
“మహారాణీ! నదికి అవతల ఉండే ఊరిలో కొంత | మంది పుణ్యపురుషులు ఉన్నా రనే సంగతి మీకు తెలుసు కదా! వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు.
వారిలో ఒకరికి మన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది. కదా” అన్నాడు రాజు. అప్పుడు రాణి, “చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా” అంది.
ఇదంతా చాటునుంచి వింటున్న శేషు, “నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది” అనుకు న్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపురుషులతో కలిసి ఆస్థానానికి వచ్చాడు.
ముం దుగా మంత్రి వచ్చి “యువరా ణిని పెళ్లిచేసుకోవటం సమ్మత మేనా?” అని అక్కడ ఉన్న ఒక్కొక్కరినీ విడివిడిగా అడి గాడు. అందరూ తమ ఆశయా లకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది, కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు.
శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మంత్రి రాజు దగ్గరకు వెళ్లి “మహారాజా! వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలం” అని చెప్పాడు.
మహారాజే అప్పుడు స్వయంగా శేషు దగ్గరకు వచ్చి “మహానుభావా ! మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక.
దయచేసి ఈ వివా హానికి అంగీకరించండి” అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. ‘మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది.
నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో’ అనుకు న్నాడు. ఆ క్షణం నుంచే శేషులో పరివర్తన ప్రారంభమయింది. ‘మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు’ అని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఆ తరవాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగ పడే మంచిపనులు చేయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.
5. అదృష్టమహిమ | New moral stories in Telugu
New moral stories in Telugu
పోయి రాక్షసుడితో తల పడ్డాడు. తెగించి పోరాడి రాక్షసుడిని చంపే శాడు. ఈ విచిత్రాన్ని చూసిన ఆట వికులు అతనికి జేజేలు పలికారు.
వీరగల్లుకు సాగిపోతుంటే అతని వెంట జనమే జనం! ఇదంతా చూసి అతని మనసు మారిపోసా గింది. బతుకు మీద ఆశ పుట్టింది.
రాక్షసుడు చావటానికి కారణం తన అదృష్టమేకానీ, వీరత్వం కాదు కదా! రాజుతో జరిగే యుద్దంలో తనకు చావు తప్పదు. వెనక్కి వెళదామనుకుం వీరగల్లు వచ్చింది.
నగర ప్రవేశ ద్వారం వద్ద పరివారంతో మహారాజు నిలబడి ఉన్నాడు. తన దుస్సాహసాన్ని క్షమించమని కోరి రాజు కాళ్ల మీద పడదామనుకుంటున్నాడు.
భద్రయ్య. ఇంతలో వీర భూపా లుడు ముందుకు వచ్చి ‘వీరాగ్రే సరా! శ్రీశ్రీశ్రీ భద్ర మహీపాలా! సుస్వాగతము!’ అంటూ మెడలో పూలమాలను వేసి భద్రయ్య ముందు మోకరిల్లాడు.
మహా తేజా! వెయ్యి మందిని బలిగొన్న రాక్షసుడిని మట్టుబెట్టిన నీతో నేను యుద్ధం చేసి గెలవటమా! ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో! నన్ను ప్రాణాలతో వదిలి పెట్టి పుణ్యం కట్టుకో!’ అని వేడుకొన్నాడు.
అదృష్టవశాత్తూ భద్రయ్య బతికి ఉన్నంత కాలం మరో వీరు డెవ్వడూ అతనిపై కయ్యానికి కాలు దువ్వలేదు.
6. తెలివైన మేక- తెలివితక్కువ తోడేలు
New moral stories in Telugu
ఒకరోజు గొర్రెలమందతో పాటు ఒక మేక పిల్ల గడ్డిమేస్తోంది. అలా తింటూ తిరుగు తుండగా కొంతదూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్లింది. అలా అది గొర్రెలమందకు దూరమైపోయింది.
మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించకోలేనంత ఆనందంగా తిరుగు తోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతీ తెలియలేదు.
సరిగ్గా అది దానిమీదకు దూకే సమ _యానికి గమనించి పరుగుతీయబోయింది. “నన్ను కాని భయంతో ఆగిపోయి, చంపకు. నీకు పుణ్యముంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు.
తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది గదా!” అంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. కొంతసేపు వేచి ఉంటానంది.
ఆ తర్వాత మళ్లీ తోడేలు దగ్గరికి వచ్చి ‘అటూ ఇటూ గెంతులేస్తాను, నేను తిన్నది. బాగా అరుగుతుంది, అప్పుడు నీకు తినడా నికి కష్టముండదు” అంది.
అందుకు తోడేలు అంగీకరించింది. అలా గెంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరికి వెళ్లి “నా మెడలో గంట తీసి వాయిస్తుండు.
నేను మరింత వేగంగా గెంతులేస్తూ ఆడ తాను” అంది. తోడేలు సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలు పెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు.
అతని తోపాటు వచ్చిన కుక్కలు వెంటపడటంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది.
7. హత్య
New moral stories in Telugu
టూటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సూర్యం, రంగయ్యలు అప్పుడే నైట్ పెట్రోలింగ్ డ్యూటీకి ఉపక్రమించారు.
ఆవీధి చివరనున్న వేడివేడి టీ తాగి, ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. గుండెల్నిండా పొగపీల్చి తృప్తిగా వదులుతూ లాఠీలూపుకుంటూ నడక మొదలు పెట్టారు.
ఓ ఇంటిముందు నుంచి వెళ్ళబోతూ ఇంటిలోపల్నుండి వినవస్తున్న మాటలకి అక్కడే ఆగిపోయారు. లోపల్నుంచి. వినబడు తున్న మాటలు వారికి అనుమానం చాయి.
“ఏంట్రా.. గుడ్లప్పగించి చూస్తావ్.. ముందు మెడ కట్ చెయ్.. ఊఁ.. తర్వాత చేతులు.. త్వరగా కానియ్”.. అన్న ఆ మాటలువిని లోపలేదో పెద్దఘోరం జరిగిపోతోందనుకు న్నారు.
డ్యూటీ ఎక్కగానే మంచి కేసు దొరికి పోయిందనీ.. దాంతో ప్రమోషన్ వచ్చేస్తుందని తెగ సంబరపడిపోయారు. ఇంటితలుపు లాఠీతో కొట్టారు. తలుపు తెరుచుకోలేదు.
ఇద్ద రికీ అనుమానం బలపడింది. మళ్ళీ తలుపులు గట్టిగా కొట్టి “రేయ్! లోపలెవర్రా.. తలుపు తీస్తారాలేదా? ” అని అరిచారు.
తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల ఓ వ్యక్తి బల్లమీద కొత్త బట్టని టేప్ తో కొలుస్తూ కత్తెరతో కట్‌చేస్తూ కనిపించాడు. తలుపు తెరచిన వ్యక్తి భయంతో కానిస్టేబుళ్ళిద్దర్నీ చూస్తూ నిలబడ్డాడు.
సూర్యం, రంగయ్యలు మాటాపలుకూ లేకుండా నీరసంగా వెనుదిరిగారు.
8. ఖాళీగూడు
New moral stories in Telugu
అన్విత, అనీష్ తో పాటు భార్యను వెంట తీసుకుని సీతారామయ్య ఇందిరాపార్కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేసాక వారు పార్కంతా తిరిగి చూస్తూంటే, ఓచోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూసాడు.
“అదేమిటి తాతయ్యా?” అడిగాడు. “పక్షి గూడు, చెట్టుమీంచి కిందపడి పోయిన ట్లుంది.” “అందులో పక్షులు ఉన్నాయా?” అన్విత అడి గింది. “లేవు. అది ఖాళీ గూడు.
సీతారామయ్య దాని దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూసి చెప్పాడు. “ఇది గోరింక కట్టుకున్న గూడు.” “కూల్! దీన్ని మేము అమెరికాకి తీసుకె ళ్ళవచ్చా?” అనీష్ అడిగాడు.
తల ఊపి సీతారామయ్య దాన్ని తీసి తన చేతి లోని సంచీలో ఉంచాడు. “అది ఎందుకు ఖాళీ అయింది? అది పిల్లల కోసం కదా గూడు కట్టింది?” అనీష్ అడిగాడు. “అవును.
కానీ పిల్లలు పెద్దయి రెక్కలొచ్చాక వెళ్ళిపోయాయి. దాంతో ఆ గూడు ఖాళీ అయింది.” “మరి పెద్ద పక్షులేమయ్యాయి?” “అవి ఇంకో గూడు కట్టుకుని వాటిలో మళ్ళీ పిల్లల్ని పెడతాయి.”
“తాతయ్య! మీ ఇల్లుకూడా ఖాళీగూడే కదా?” కొద్దిసేపాగి అనీష్ అడిగాడు. “ఎందుకని?” “గోరింక పిల్లలు వెళ్తే ఈ గూడు ఖాళీ అయిపో యినట్లుగా మీ పిల్లలు ఇద్దరూ అమెరికాకి వెళ్ళి పోతే మీ గూడు కూడా అయిపోయింది కదా?” “అవును.
రేపు మీరు పెద్దయి కాలేజీకి వెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగం వచ్చాకో లేదో పెళ్ళిచేసుకు న్నాకో వెళ్ళిపోతే మీ గూడు కూడా ఖాళీ అవు తుంది.
ఇది లోక సహజం.” సీతారామయ్య చెప్పాడు. అంతసేపూ వారి సంభాషణని మౌనంగా వింటున్న సీతారామయ్య భార్య చెప్పింది. “కాకపోతే మనమంతా ఓ పెద్ద గూడులోనే కలిసి ఉంటున్నాం.
కాబట్టి ఒకర్ని మరొకరం మిస్ “అవడం లేదు.” “పెద్ద గూడు ఎక్కడ ఉంది?” అన్విత వెంటనే అడిగింది. “ఈ ప్రపంచమే ఆ పెద్ద గూడు. మనమంతా. దేవుడి పిల్లలం.
కాబట్టి మనమంతా ఒకే కుటుం బానికి చెందిన వాళ్ళం. ఈ గూడుని వదిలి వెళ్ళడం అంటే మరణించడమే. అంతదాకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరినొకరు చూసుకోగలం” ఆవిడ చెప్పింది.
“ఓ!” ! “కాకపోతే మనమంతా ఒకే గూటిలో ఉన్నాం అన్న సంగతి తెలుసుకోకుండా ఒకరికొకరం దూరమైపోయాం అనుకుని చాలామంది బాధప డుతూంటారు.
ఇది తప్పు. కాబట్టి మీరు తిరిగి అమెరికా వెళ్ళబోయేముందు మమ్మల్ని వదిలి వెళ్తు న్నామని ఏడవ కూడదు”- సీతారామయ్య వారికి చెప్పాడు.
9. అసలు విషయం
New moral stories in Telugu
వెంకట్‌తో పెళ్ళి నిశ్చయమయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్‌కి చదువు పెద్దగా లేదు. పైగా చేస్తున్నది వ్యవసాయం.
ఈ సంగతి తన ఫ్రెండ్స్‌కి తెలియగానే వాళ్ళం చూస్తారేమోనని దరూ భయం. చుక అఖిల తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు.
వాళ్ళందరి ఇళ్ళల్లో అన్నీ ఫారిన్ వస్తు వులే, కట్టూబొట్టూ అంతా హైక్లాసుగానే ఆంటుంది మరి. తన సంబంధం గురించి. ఫ్రెండ్స్‌కి ముందే చెపితే సమస్యే లేదనుకున్న అఖిల అందరికీ చెప్పేసింది.
“యు ఆర్ రియల్లీ గ్రేట్” అంటూ అందరూ అఖిలని ఒకటే పొగిడేశారు. తనని ఆటలు పట్టిస్తున్నారనుకున్న అఖిల “ప్లీజ్… చులకన చేయకండే ఉన్న విషయం చెప్పానంతే..
ఇంకా నేనతన్ని పెళ్ళి చేసుకోలే దుగా!” అంది. “అఖిలా! మేం నిజం గానే నిన్ను అభినంది స్తున్నాం.. నీ ఎంపిక చాలా బాగుంది.
నిజా నికి మేమందరం ఫారిన్ సంబంధాలని మోజుపడి చేసు కున్నాం, కానీ ఎంతో అసంతృ ప్తితో బతుకుతున్నాం. సిగ్గుతో ఎవరికీ పోతున్నాం.
మేం చేసుకున్న వాళ్ళు అక్కడ వెలగబెట్టేవి చిన్నా చితక మున్సిపాలిటీ ఉద్యోగాల్లాంటివే. దేశంకాని దేశంలో, కుక్కిన పేనుల్లా, అభద్రతాభావంతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి.
కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టి పెరిగిన ఊళ్ళోనే దర్జాగా స్వంత వ్యవసాయం చేసుకుంటూ పదిమందికీ సాయపడుతూ మహారాజులా ఉన్నాడు.
అంతకన్నా కావల్సిం దేముంటుందే!” అన్నారు. వారి మాటలకి వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనం దంతో నిండిపోయింది.
10. ప్లాన్
New moral stories in Telugu
ప్రతి పనీ ప్లాన్ చెయ్యడం నా అల వాటు. అదే నా సక్సెస్‌కి కారణం అనుకుం నేను ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. అటు కంపెనీ, ఇటు సొంత విషయంలో ఏది చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలో చించి అడుగేస్తాను.
నా భార్య మానస కంపెనీలోనే పనిచేసే ఒక ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని పసిగట్టాను. అంతే.. ఆ గుట్టుచు ప్పుడు కాకుండా పైలోకానికి పంపించడానికి పక్కా ప్లాన్ వేశాను.
మానస హత్య జరిగే రోజు నేనెక్కడో దూరంగా బిజినెస్ మీటింగ్‌లో ఉంటాను కాబట్టి అదే బలమైన ఎలిబీ. ప్రొఫె షనల్ కిల్లరికి ప్లానంతా వివరించి అన్ని జాగ్ర త్తలూ తీసుకుని అతనికి పని అప్పగించాను.
కిల్లర్ నుండి వచ్చిన ఫోన్ అందుకున్నాను. “సర్! పని సవ్యంగా పూర్త యింది” అన్నాడు కిల్లర్. నా పెదవులపై మంద హాసం. సాయంత్రం రోజు తిరిగొచ్చి తిన్నగా ఇంటికి చేరాను. మానస తలుపు తీసింది.
ఆమెను చూడగనే బిత్తరపోయాను. నా ప్లాన్ నా ఎక్కడో తల్లకిందులైందనుకు న్నాను. తర్వాత అర్థమైంది, కిరాయి హంతకుడు చంపింది. నా భార్యని కాదు ఆమెలానే ఉండే ఆమె చెల్లెలు మమతని.
వాళ్ళిద్దరూ కవల పిల్లలు. “నిన్ను చూసి లమైంద ఎంతకా ని మమత ఎంతో సంబరపడి. వచ్చిం దండీ. ఏ దుర్మార్గుడో దాని ప్రాణాల్నిలా హరించివేశాడు.
ఆ కిరాతకుడికి పుట్టగతులుండవ్.. తీసుకు.. తీసుకు వస్తాడు” అంటూ కొన్ని రోజులవరకూ శాపనార్థాలు పెడుతూనే ఉంది మానస.