Moral stories in Telugu for students
1. ప్రేమపూలు | Moral stories in Telugu for students
Moral stories in Telugu for students
రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరివారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు.
అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చే వారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్లాడు.
సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితి గతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనం దంగా ఉన్నారు. ఒకరితో ఒకరికీ గొడవలు లేవు.
ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురూ పంచుకుంటారు. ఏ సమస్యా లేకుండా జీవిస్తు న్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు.
ఒక వృద్ధురాలు “కొంత కాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి.
ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేం ఆనందంగా ఉంటున్నాం” అని చాలా చెప్పింది.
వెంకయ్యకి అసూయ కల్గింది. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్టు చేయా లనుకున్నాడు. ఒకరాత్రి రహస్యంగా తన మను షులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు.
వాటికి ఉన్న పూల గుత్తులను పీకేసి ఎవరికీ కన్పించకుండా దూరంగా పడేశాడు. కొన్నిరోజుల తరువాత వెంకయ్య పనిగట్టు కుని ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు.
ఆ ఊరి స్థితి గతులు మారిపోయి, మనుషుల మధ్య పార పొచ్చాలు, గొడవలు కలిగి ఉంటాయని భావిం చాడ వెంకయ్య. కాని అక్కడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా అభిమానంగా ఉన్నారు.
ఒక్క క్షణం వెంకయ్యకు మతిపో యింది. ఆ తరువాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్ధం అయ్యింది.
ఆ మహా నుభావుడు అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు ఇండ్ల లోగిళ్ళలో కాదు జనాల మనసుల్లో నాటాడు. మొక్కల్లాగే అవి దినదినాభి వృద్ధి చెంది వారి హృదయం నిండి విచ్చుకు న్నాయి.
అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇకముందు మార్పు రాదు కూడా’ అన్న సత్యం బోధపడ్డ వెంకయ్య ఇక ఆ ఊరి జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.
2. సత్యనాథుడి సంతృప్తి
Moral stories in Telugu for students
మల్లపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడం పైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలనీ, అలా ఉంటే పాలన సులభమవుతుందనీ అనుకునే వాడు విశ్వనాథుడు.
దానికి తగ్గట్లే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు.
ఒక రోజు “ఓ రాజా! ఈ ఏడు పాత్రల్లో ఉన్న వజ్రవైఢూర్యాలతో నీ ఖజానా నిండిపోతుంది. హాయిగా పాలించవచ్చు. కాని దీనిలో నీ ప్రయత్నం లేదనే అసంతృప్తి కలుగకుండా ఉండాలని ఒక పాత్రలో సగం మాత్రమే ఆభరణాలు నింపాను.
మిగిలిన సగం నువ్వు నింపి ఆ మొత్తాన్ని ఖజానాలో వేస్తే అది ఎన్ని తరాలకైనా సరిపోతుంది” అని ఒక రాజు దేవత రాజుకు కలలో ప్రత్య క్షమై చెప్పింది.
వెంటనే మేల్కొని చూశాడు. నిజంగానే అక్కడ ఆరు పాత్రల్లో నిండుగా, మరో పాత్రలో సగానికి కళ్లు మీరు మిట్లు గొలిపే ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటిమీద ఉన్న ఆభర ణాల్ని తీసి ఏడో పాత్రలో వేశాడు.
కాని అది నిండ లేదు. రాణి నగలు తెప్పించి. అందులో వేసి చూశాడు. అయినా ప్రయోజనం లేక పోయింది. ఇలా కాదని ఖజానాలో ఉన్న ఆభర ణాల్ని ఒక్కొక్కటీ తెచ్చి పాత్రలో వేయడం మొదలు కథ పెట్టాడు.
ఎన్ని వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి విషయం అర్ధమై రాజు దగ్గరగా వచ్చి “రాజా! ఆ పాత్ర ఉంది చూశారా? అది మన మనస్సులాం టిది. దానికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు.
మీరు ఆ విషయం అర్ధం చేసుకుని ఈ వృధా ప్రయత్నం ఆపండి” అని చెప్పాడు. తనలో మార్పు తీసుకురావడానికే తన ఆరాధ్యదైవం ఇలా చేసి ఉంటుందని భావించిన రాజు అప్పట్నుంచి ఖజానా మీద కంటే పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టి జనరంజకంగా పాలన సాగిం చాడు.
3. ప్రాణానికి ప్రాణం | Moral stories in Telugu for students
Moral stories in Telugu for students
ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటికి తీశాడు.
ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. “అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు.
కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు,” అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. “అతను చెప్పింది నిజమే ప్రభూ! అదొక విషప్రాణి. చచ్చిపోయినా | కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి.
సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు. కాని ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు. అందుకే దాన్ని చంపేశాను.
అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షిం చండి,” అని వినయంగా చెప్పాడు రామయ్య. కథ చంపాలనే “పాము ప్రమాదకరమైనది. సహజంగా మనుషులు దాన్ని చూస్తారు.
బయటికి రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాడు | కోవాల్సింది” అంటూ మర్యాదరామన్న సోమయ్యకి సర్దిచెప్పబోయాడు.
మర్యాదరామన్న మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా “కంటికి కన్ను, పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము | ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే.
నేరస్తులను మీరు శిక్షిం చకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చుపెరిగిపోతాయి. నేను ఇతణ్ణి వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను” అన్నాడు అవేశంగా సోమయ్య.
సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాదరామన్నకు ఒక ఆలోచన తట్టింది. “నీ పామును| రామయ్య ఎలా చంపాడు?” అని అడిగాడు రామన్న.
“ఎలా చెప్పమంటారు? దాని తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు.” అని చెప్పాడు సోమన్న. “సరే, నువ్వు కూడా అలాగే చంపు.
అతని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిర గిరా నెలకేసి కొట్టు” అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. “మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు” అన్నాడు.
అప్పుడు న్యాయాధికారి శాంతంగా “ఔను నిజమే. మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం. కాబట్టి నువ్వు నీ ఫిర్యాదును వెనుకకు తీసుకుని ఇంటికి వెళ్ళిపో” అని తీర్పు చెప్పాడు.
మర్యాదరామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకుని తల వంచుకుని ఇంటికి వెళ్లిపోయాడు సోమయ్య.
4. బుజ్జిమేక – పందిపిల్ల
Moral stories in Telugu for students
ఒక రైతు కొన్ని మేకలను, కొని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది.
పందిపిల్లేమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు.
అవతలికి పో” అని చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడు కుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది. “అమ్మా నాకూ స్నానం చేయిం చవే.
ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకో వట్లేదు” అని తల్లితో అంది పందిపిల్ల. “చూడు బంగారం, మనం మన లాగే ఉంటాం. ఇంకోలా ఉండటం. మనకు కుదరదు.
మన శరీరానికి చెమ టపట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ ఒంటి తడుపుకుంటూ తల్లి వివరించి మ ఉండాలి.” పందిపిల్లకు ఇదంతా అర్ధం చేసు కునే వయసులేదు.
కాస్సేపు వాళ్ళ మ్మతో గునిసింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేక పిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి.
ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి ఎలా పసికట్టిందో. మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండ టంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు యింది.
నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పంది పిల. “ఏయ్ పారిపో త్వరగా పారిపో… నక్కొస్తోంది..” అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది.
మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పంది పిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందువేసి బాగు చేసాడు రైతు.
ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్త నను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత రెండూ ప్రాణస్నేహి తులయ్యాయి.
5. చూసే దృష్టి | Moral stories in Telugu for students
Moral stories in Telugu for students
విష్ణుశర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకలశాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకు మంచి పేరు ఉండేది.
ఆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండే వారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణుశర్మతో సన్నిహితంగా మెలిగే వాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలను నివృత్తి చేసుకొనేవాడు.
ఒకరోజు విష్ణుశర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, “నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీ కన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకొని రావాలి” అని చెప్పాడు.
రెండో శిష్యుడితో “నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి” అని చెప్పాడు. మూడో శిష్యుడితో “నీ కన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని రావాలి” అని చెప్పాడు.
గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలు దేరి వెళ్లారు. కొంతకాలానికి ఆ ముగ్గురూ తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావటం చూసిన దిలీపుడు గురువు దగ్గరకు వెళ్లి “గురువర్యా! ఆ ముగ్గురే తిరిగి వచ్చారు.
మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతు పట్టడం లేదు” అన్నాడు.. అప్పుడు గురువు “అందుకు కారణాన్ని వారి నోటి వెంటే | విందువు గాని పద” అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు.
మొదటి శిష్యుడు “ఈ రాజ్యంలో అందరూ నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు. అందుకే నేనొక్కడినే వచ్చేశాను” అని చెప్పాడు.
రెండో శిష్యుడు “అందరూ నా కన్నా తెలివైన వారే ఎదురు పడ్డారు. నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా. దొరకలేదు,” అని చెప్పాడు. మూడో శిష్యుడు “అందరూ నాతో సమానమైన తెలివితేట లనే కలిగి ఉన్నారు.
అందుకే మీరు చెప్పిన ఇద్దర్ని తీసుకురాలేక పోయాను ” అని చెప్పాడు. వారి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, “గురు వర్యా! వీరు ముగ్గురు వెళ్లింది ఒక రాజ్యానికే కదా! కాని ముగ్గురూ మూడు రకాలుగా మాట్లాడుతున్నారు.
కారణం వివరించండి” అని గురువుని కోరాడు. అప్పుడు గురువు “ఒకరేమో తాను చాలా తెలివైనవాడిననే అహంకారంతో అందర్నీ పరిశీలించటంతో అతనికన్నా తెలివైన వాళ్లు ఎవరూ కనిపించ లేదు.
మరొకరేమో తాను అందరి కంటే తక్కువ అనే న్యూనతా భావంతో పరిశీలించటంతో అందరూ తన కన్నా తెలివైన వారిగానే కనిపించారు.
ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అనే దృష్టి ఉండటం వలన అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కన్పించారు. మనం చూసే దృష్టిని బట్టి ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి,’ అని వివరించాడు.
గురువు తనకు ఉపదేశించదలచుకున్నది ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుంచి దిలీపుడు ఆత్మన్యూనతను గాని, అహంకారాన్ని గాని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు.
6. పనితనం
Moral stories in Telugu for students
ఒక కుర్రాడు ఒక మెడికల్ షాపుకి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ని అడిగాడు. “ఇది ఎస్.టి.డి. బూత్ కాదు కానీ, నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో” అని బదులిచ్చాడు.
ఓనర్. ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నంబర్కి డయల్ చేశాడు. షాపులో కస్టమర్లు ఎవరూ లేక పోవడంతో షాపు ఓనర్ కుర్రాణ్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు.
“అమ్మా, మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా?” అని ఫోన్లో అడిగాడు కుర్రాడు. “ఇప్పటికే ఒకతను నా దగ్గర తోటమాలిగా పనిచే స్తున్నాడు” అని అంది. అవతలి స్త్రీ.
“అమ్మా, నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికే, అతని కంటే ఇంకా బాగా పనిచేస్తాను” అన్నాడు కుర్రాడు. తన దగ్గర పని చేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆ స్త్రీ బదులి చ్చింది.
ఆ కుర్రాడు మరింత పట్టుదలతో, “అమ్మా, నేను మీ ఇల్లంతా స్తాను. మీ ఇంటి తోటను ఈ నగరంలోనే అత్యంత అందమైన తోటలా మారు స్తాను” అన్నాడు.
అవసరం లేదు బాబూ” అని అవతలి స్త్రీ ఫోన్ పెట్టేసింది. ముఖంపై చిరునవ్వుతో, ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టేశాడు. అతని సంభాషణ విన్న షాపు ఓనర్ ఆ కుర్రాడితో “బాబూ! నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది.
నీలో ఉన్న ఆశావహదృక్పథం నన్నెంతో ఆకట్టుకుంది. నీకు నేనొక జాబ్ ఇస్తాను. చేస్తావా?” అని అడిగాడు. “చాలా కృతజ్ఞతలండీ.
కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికే ఈ ఫోన్ కాల్ చేశాను. నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా పనిచేస్తున్నాను” అని జవా బిచ్చాడు కుర్రాడు.
7. లక్ష్యసిద్ధి | Moral stories in Telugu for students
Moral stories in Telugu for students
అనగనగా శంఖవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి, అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత కచేరీలతో చుట్టు పక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధి గాంచారు.
ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు. శాస్త్రిగారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరుల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు.
ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టు పక్కల ఊళ్ళ నుంచి ఆహ్వానాలు వచ్చేవి. శేషయ్య శాస్త్రి ఎప్పుడూ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. అయినా | కొద్దిమందికి శిక్షణ ఇచ్చేవారు.
శ్రీధర్ శర్మ అనే ఒక యువకుడు శేషయ్యశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరాడు. ఆధునిక స్వభావం కలి గిన వ్యక్తి శ్రీధర్ శర్మ ఏపనైనా నిముషాల మీద అయిపోవాల | నుకునేవాడు.
ఎంతటి కార్యం అయినా ఇట్టే పూర్తి చేయాలని కలలు కనేవాడు. సంగీత సాధనపై కూడా ఇటువంటి అభి ప్రాయమే శ్రీధర్ శర్మకు ఉండేది. వీలైనంత త్వరగా సంగీత పాఠాలు పూర్తి చేసి కచేరీలు ఇవ్వాలని భావించాడు.
మొదటిరోజు సంగీత పాఠశాలకు శ్రీధర్ శర్మ వెళ్లాడు. సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు. “ఇక్కడ సంగీత సాధనకు ఎంత కాలం పడుతుంది” అని వారిని అడిగాడు.
ఆరు నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని, ఆ తర్వాత మరో ఆరు నెలలు సంగీత సాధన చేయాల్సి ఉంటుందని’ వారు తెలిపారు. అయితే “నేను ఆరు మాసాలు పూర్తి చేసిన వారితో చేరతాను” అన్నాడు.
అలాగే ఆరు మాసాలు సంగీత సాధన పూర్తి చేసిన వారితో కలిసి సంగీత సాధన పూర్తి చేశాడు. ఆ తరువాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వటం ప్రారంభించాడు.
సంగీతంలో అంత పట్టు లేకపోవడంవల్ల అతని కచేరీల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించసాగింది. కచేరీలకు వచ్చిన వారు శ్రీధర్ శర్మ మొహం మీదే “ఇదేం సంగీత కచ్చేరి” అని విమర్శించసాగారు.
ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావటంతో శర్మ ఖంగు తిన్నాడు. వెంటనే కథ గురువు దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. క్షమాపణ కోరాడు.
అప్పుడు గురువు “నడక నేర్వకుండా పరుగు కోసం తాపత్రయ పడితే ఇటువంటి అనుభవాలే ఎదురౌతాయి” అని హితబోధ చేశారు. శ్రీధర్ శర్మ చేసిన తప్పుకు చింతించాడు.
అన్నింటికీ దగ్గర దారులు ఉండవని గ్రహిం చాడు. మళ్లీ పాఠశాలలో మొదటి నుంచి సంగీత సాధన ప్రారంభిం చాడు. సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు.
గురువు గారి ఆశీస్సులు పొందాడు. ఆ విధంగా శర్మ తను అనుకున్న లక్ష్యం నెర వేర్చుకున్నాడు.
8. వ్యర్థ ఉపకారం
Moral stories in Telugu for students
ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలి తాన్ని, సంతృప్తినిస్తుం ది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు.
ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది.
అది తీసుకోలేక మింగలేక నానా అవస్థా వడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చేపోయే అంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని | కోరింది.
కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువూ, పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ల లేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనిం చింది.
అయ్యో ఇది నిజంగానే బాధపడు తోందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేస్తే లబ్ది పొందవచ్చుననుకుంది. తోడేలు దగ్గరికి వెళ్లి నోరు తెరచి ఉంచ మంది.
తన పెద్దముక్కును నోటిలోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు ‘హమయ్య’ అనుకుంది. ఎంతో సాయం చేశావని కొంగను మెచ్చుకుంది. “నీరు అంత సాయం చేస్తే ఒక్క మాటతో సరిపె ట్టుకుంటావా “అంది కొంగ.
దాని ఆమా యకత్వానికి నవ్వుకుని తోడేలు, “అమాయకురాలా! నా బాధను తప్పించావు గనుక నిన్ను క్షమించి వదిలేశాను, లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను ఫలహారంగా తిన లేకకాదు.
బతికిపోయావు. వెళ్లిపో… అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అనుకుంది.
9. ఖాళీగూడు
Moral stories in Telugu for students
అన్విత, అనీష్ తో పాటు భార్యను వెంట తీసుకుని సీతారామయ్య ఇందిరాపార్కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేసాక వారు పార్కంతా తిరిగి చూస్తూంటే, ఓచోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూసాడు.
“అదేమిటి తాతయ్యా?” అడిగాడు. “పక్షి గూడు, చెట్టుమీంచి కిందపడి పోయిన ట్లుంది.” “అందులో పక్షులు ఉన్నాయా?” అన్విత అడి గింది. “లేవు. అది ఖాళీ గూడు.” సీతారామయ్య దాని దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూసి చెప్పాడు.
“ఇది గోరింక కట్టుకున్న గూడు.” “కూల్! దీన్ని మేము అమెరికాకి తీసుకె ళ్ళవచ్చా?” అనీష్ అడిగాడు. తల ఊపి సీతారామయ్య దాన్ని తీసి తన చేతి లోని సంచీలో ఉంచాడు.
“అది ఎందుకు ఖాళీ అయింది? అది పిల్లల కోసం కదా గూడు కట్టింది?” అనీష్ అడిగాడు. “అవును. కానీ పిల్లలు పెద్దయి రెక్కలొచ్చాక వెళ్ళిపోయాయి.
దాంతో ఆ గూడు ఖాళీ అయింది.” “మరి పెద్ద పక్షులేమయ్యాయి?” “అవి ఇంకో గూడు కట్టుకుని వాటిలో మళ్ళీ పిల్లల్ని పెడతాయి.” “తాతయ్య! మీ ఇల్లుకూడా ఖాళీగూడే కదా?” కొద్దిసేపాగి అనీష్ అడిగాడు.
“ఎందుకని?” “గోరింక పిల్లలు వెళ్తే ఈ గూడు ఖాళీ అయిపో యినట్లుగా మీ పిల్లలు ఇద్దరూ అమెరికాకి వెళ్ళి పోతే మీ గూడు కూడా అయిపోయింది కదా?” “అవును.
రేపు మీరు పెద్దయి కాలేజీకి వెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగం వచ్చాకో లేదో పెళ్ళిచేసుకు న్నాకో వెళ్ళిపోతే మీ గూడు కూడా ఖాళీ అవు తుంది. ఇది లోక సహజం.” సీతారామయ్య చెప్పాడు.
అంతసేపూ వారి సంభాషణని మౌనంగా వింటున్న సీతారామయ్య భార్య చెప్పింది. “కాకపోతే మనమంతా ఓ పెద్ద గూడులోనే కలిసి ఉంటున్నాం.
కాబట్టి ఒకర్ని మరొకరం మిస్ “అవడం లేదు.” “పెద్ద గూడు ఎక్కడ ఉంది?” అన్విత వెంటనే అడిగింది. “ఈ ప్రపంచమే ఆ పెద్ద గూడు. మనమంతా దేవుడి పిల్లలం. కాబట్టి మనమంతా ఒకే కుటుం బానికి చెందిన వాళ్ళం.
ఈ గూడుని వదిలి వెళ్ళడం అంటే మరణించడమే. అంతదాకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరినొకరు చూసుకోగలం” ఆవిడ చెప్పింది.
“ఓ!” “కాకపోతే మనమంతా ఒకే గూటిలో ఉన్నాం అన్న సంగతి తెలుసుకోకుండా ఒకరికొకరం దూరమైపోయాం అనుకుని చాలామంది బాధప డుతూంటారు. ఇది తప్పు.
కాబట్టి మీరు తిరిగి అమెరికా వెళ్ళబోయేముందు మమ్మల్ని వదిలి వెళ్తు న్నామని ఏడవ కూడదు”- సీతారామయ్య వారికి చెప్పాడు.
10. అసలు విషయం
Moral stories in Telugu for students
వెంకట్తో పెళ్ళి నిశ్చయమయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్కి చదువు పెద్దగా లేదు, పైగా చేస్తున్నది. వ్యవసాయం.
ఈ సంగతి తన ఫ్రెండ్స్కి తెలియగానే వాళ్ళం దరూ చూస్తారేమోనని భయం. చులకనగా అఖిల తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు.
వాళ్ళందరి ఇళ్ళల్లో అన్నీ ఫారిన్ ‘ వస్తు వులే, కట్టూబొట్టూ అంతా హైక్లాసుగానే అంటుంది మరి. తన సంబంధం గురించి ఫ్రెండ్స్కి ముందే చెపితే సమస్యే లేదనుకున్న అఖిల అందరికీ చెప్పేసింది.
“యు ఆర్ రియల్లీ గ్రేట్” అంటూ అందరూ అఖిలని ఒకటే పొగిడేశారు. తనని ఆటలు పట్టిస్తున్నారనుకున్న అఖిల “ప్లీజ్.. చులకన చేయకండే ఉన్న విషయం చెప్పానంతే.. ఇంకా నేనతన్ని పెళ్ళి చేసుకోలే దుగా!” అంది.
“అఖిలా! మేం నిజం గానే నిన్ను అభినంది స్తున్నాం.. నీ ఎంపిక చాలా బాగుంది. నిజా నికి మేమందరం ఫారిన్ సంబంధాలని మోజుపడి చేసు కున్నాం, కానీ ఎంతో అసంతృ ప్తితో బతుకుతున్నాం.
సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక పోతున్నాం. మేం చేసుకున్న వాళ్ళు అక్కడ వెలగబెట్టేవి చిన్నా చితక మున్సిపాలిటీ ఉద్యోగాల్లాంటివే. దేశంకాని దేశంలో, కుక్కిన పేనుల్లా, అభద్రతాభావంతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి.
కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టి పెరిగిన ఊళ్ళోనే దర్జాగా స్వంత వ్యవసాయం చేసుకుంటూ పదిమందికీ సాయపడుతూ మహారాజులా ఉన్నాడు.
అంతకన్నా కావల్సిం దేముంటుందే!” అన్నారు. వారి మాటలకి వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనం దంతో నిండిపోయింది.