Akbar Birbal Stories in Telugu | Story 21 to 25

21. కళ్ళున్న కబోదులు | Akbar Birbal Stories in Telugu

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar Birbal Stories in Telugu

ఒకనాడు అక్బరుపాదుషావారు ‘బీర్బల్తో కలసి నగరసంచారానికి బయలుదేరారు. వారికి కొంతదూరంలో ఒక ముష్టివాడు ఒక పౌరుడు, నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడివని, దెబ్బలాడుకొంటూ కనిపించారు.

పలువురు వాళ్ళవద్దకు వెళ్ళి ఎందుకిలా దెబ్బలాడుకుంటున్నారని ప్రశ్నించాడు. అయ్యా! నేను బిక్షగాడిని, దానధర్మాల నిమిత్తం నేను కళ్ళులేని కబోధిగా భిక్షమెత్తుకుంటున్నాను.

ఈ దాత నన్ను గుడ్డివాడినని నమ్మి నాకు సత్తు నాణాన్ని భిక్ష వేశాడు. ఏమిటని మేలుకొని నేను వాదిస్తుంటే నువ్వు కళ్ళుండి కళ్ళులేని వాడిగా నన్ను మోసగించావని నన్ను నిందిస్తున్నాడు.

తను చేసిన మోసాన్ని సమర్ధించుకుంటున్నాడని వివరించాడు. వాళ్ళ తగువును పరిష్కరించి, మంచినాణెం వానికిప్పించి, మాయవేషాలు మాని, భిక్షమెత్తుకోవడం భిక్షగానికి సరైనమార్గమని నచ్చజెప్పి సాగనంపారు.

బీర్బల్! వాడు అలా కళ్ళులేని కబోదిగా ప్రవర్తించడం తప్పుకాదా?” అన్నాడు అక్బర్. “కూటికోసం కోటివేషాలు ఎదుటి వారిదయకోసం తానుగుడ్డివాడుగా నటిస్తున్నాడు వీడు

కాని చాలామంది కళ్ళుఉండి కూడా కబోదుల్లా ప్రవర్తిస్తుంటారు” అన్నాడు బీర్బల్. “అల్లాగయితే అల్లాంటి కబోదులు కళ్ళున్నవాళ్ళు ఎవరెవరో తేల్చి చెప్పవలసినదని” అక్బరు

బీర్బలు ఆజ్ఞాపించాడు. ఆ మర్నాడు ఊరుకు శివారున – సామాన్య దుస్తులు వేసుకుని బీర్బల్ ఒక వ్రాతగాడిని వెంటకూర్చుండబెట్టుకుని జోళ్ళుకుడుతూ కూర్చున్నాడు.

ఆ త్రోవన వెళుతున్న వాళ్ళు బీర్బల్ను చూచి మీరు జోళ్ళుకుడుతున్నారా అని కొందరు, యేం చేస్తున్నారని మరికొందరు, అంటూ పలకరిస్తూ తమ దారిన వెళ్ళిపోతున్నారు.

ఈ వైనం అంతా వ్రాతగానిచేత జాబితాగా వ్రాయిస్తున్నాడు. అదే త్రోవన వెడుతూ అక్బరువారు బీర్బల్ను చూచి “యేం చేస్తున్నావు” బీర్బల్ అని ప్రశ్నించి, సమాధానం పొంది వెళ్ళిపోయారు.

మర్నాడు దర్బారులో బీర్బల్ తాను తయారుచేయదలచిన జాబితాను చూపించి “అక్బర్ వారికి నమస్కారం కళ్ళున్న కబోదులే మనరాజ్యంలో ఎక్కువగా ఉన్నారని” తేల్చి చెప్పాడు.

మరి నన్ను ఏ జాబితాలో చేర్చావు?” అని అక్బర్ బీర్బలు ప్రశ్నించాడు. “తమర్నికూడ కళ్ళున్నకబోదుల్లోనే చేర్చాను. నేను చేస్తూన్న పనిని చూస్తూకూడ తమరు ఏంచేస్తున్నావని అడిగారు” అనిచెప్పాడు. అక్బరుపాదుషావారు మరి మాట్లాడలేదు.

22. మీసాలు లాగిన వానిని ఏంచేయాలి ?

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

ఆనాడు అక్బరుపాదుషావారు సభకు కాస్త ఆలస్యంగా వచ్చారు. సమయపాలన పాటించే అక్బరువారి ఆలస్యానికి సభాసదులు తత్తరపడ్డారు.

అది గమనించిన అక్బరువారికి వారితత్తరపాటు ఔచిత్యాన్ని గురించి ప్రశ్నించాలన్న ఆసక్తి కలిగింది. తమరాకకు గల ఆలస్యాన్ని సభాసదులకు వివరించారు.

నేను దర్బారుకు బయలుదేరి వస్తున్న సమయంలో ఒకడు వచ్చి నా దుస్తులను చిందరవందర చేసాడు. గడ్డంపట్టుకుని పీకేడు. మీసాలను లాగి నన్ను బిత్తరపర్చాడు.

వాడ్ని యేంచెయ్యాలో తోచక తేరుకుని సభవారినే నిర్ణయించమని అడగవచ్చని రావడంతో ఈ ఆలస్యం జరిగింది. నేనిప్పుడు వానిని యేంచెయ్యాలి.

సభవారే నిర్ణయించాలన్నాడు అక్బరు. “ప్రభూ! వానిని కఠినంగా శిక్షించాలి – చెరసాలలో పెట్టాలి. దేశంనుండి బహిష్కరించాలి. కొరడాలతో కొట్టించాలి”.

అని ఎవరికి తోచిన శిక్షను వారు సూచించారు. బీర్బల్ లేచి “ప్రభూ! వానిని మీరు ఏ విధంగానూ శిక్షించడం సబబు కాదు. మీపైకి వచ్చి మీదుస్తులు నలిపి, మీసాలు మెలిపెట్టి, గెడ్డం మెలిపెట్టి వ్యవహరించగల హక్కుగాని.

అవకాశంగాని ఇతరులెవ్వరికి ఉండదు. తమ మనుమలకు మాత్రమే ఆ అవకాశం కలుగుతుంది, మీమీది మమతానురాగంతో.

మీరు వారిపట్ల చూపించు గారమువల్లను మీతో ఈ తరహా చనువును ప్రదర్శించడం వారికే చెల్లుతుంది. ఇలా తమతో ఆటలాడుకుని మిమ్ములను మురిపించు మీ మనువడికి మీరు మిఠాయిలు పంచి పెట్టాలి.

ముద్దులు కురిపించాలి. కానుకలివ్వాలి” అని వివరించాడు బీర్బల్. అతని ఆలోచనాసరళికి సహేతుకమైనవివరణకు, అవగాహనకు అక్బరుపాదుషావారు మిక్కిలి ఆనందించి వానిని కానుకలతో సత్కరించారు.

23. మంత్రిపదవికై దిలావకర్ ఖాన్ గారు | Akbar Birbal Stories in Telugu

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar Birbal Stories in Telugu

అక్బరుపాదుషావారి బావమరిది దిలావకర్ ను తనమట్టుకుతాను ఎంతో తెలివిగలవాడినని నమ్మకం.

అంతటివాడైన తనను అక్బర్వారు గుర్తించి మంత్రి పదవినివ్వక సోమరిగా కూర్చుండబెట్టి నిరర్దకుణ్ని చేస్తున్నారని వాపోతుండేవాడు.

ఒకనాడు సాహసించి దిలావకర్భను తనకు మంత్రిపదవిని ఇవ్వవలసినదని అక్బరును కోరుకున్నాడు దిలావకర్. హాయిగాతిని కూర్చొనవలసిన నీకీ మంత్రిపదవి ఆశ దేనికి? మంత్రికి మంచి బుద్ధికుశలత ఉండాలి.

జరుగనున్న వ్యవహారముల పట్ల మంచి అవగాహన ఉండాలి. ప్రజల మనస్సెరిగేప్రాజ్ఞత ఉండాలి. అపాయంలోను ఉపాయాలలోను వివేకవిజ్ఞానాలుండాలి.

రేపు సభలో నీ అభిమతాన్ని విచారణ చేస్తాను. అన్నాడు పాదుషా. మర్నాడు దర్బారు జరుగుతుండగా అక్బరుపాదుషా దిలావకరనును సంభోధించి

“ఖాన్! ఇప్పుడీ దర్బారులో ఉన్నవారందరిలో ఉన్న ఆలోచనయేమిటో వివరించు” అని అడిగెను. అందుకు ఇదేమి ప్రశ్న. సభాసదులందరి మనస్సులలోని ఆలోచనలు చెప్పుట ఎవరికి మాత్రము సాధ్యము అన్నాడు.

అంత అక్బరు, బీర్బలు ఉద్దేశించి నువ్వేమయినా చెప్పగలవా అని ప్రశ్నించెను. “జహాపనా! ఈ దర్బార్ దిగ్విజయంగా జరగాలని, ప్రభువువారు విజయపరంపరలతో ప్రజలను పరిపాలించాలని ఆలోచనలతో ఉన్నారన్నాడు”.

నిజమా ఇది అని అక్బరు సభికులను ప్రశ్నించగా నిజం అన్నారు అందరూ. ఏమంటావు దిలావకరా ఖాన్. ఈపాటి విషయం గ్రహించలేని నీవు మంత్రిపదవిని నిర్వహించగలిగే ఆశను విడిచిపెట్టు హాయిగా దేవిడీలో, కాలక్షేపము చేసుకొనుము” అన్నాడు అక్బరు.

24. గాడిదలు పొగాకు తినవు

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

ఒకనాడు అక్బరుపాదుషావారు బీర్బల్ తో కలసి ఊరి పొలిమేరల పొలాలను చూస్తూ వెడుతున్నారు. ఒక పొగాకుతోటలో రెండుగాడిదలు, ఆ మొక్కలతో పాటు మొలచిన గడ్డినిమేస్తూ కనిపించాయి.

అక్బరుకు బీర్బల్ను గేలిచేయాలన్న ఆలోచన కలిగింది. బీర్బలు తాంబూలంలో పొగాకు ముక్కలు వేసుకునే అలవాటుంది. అది ఆస్కారం చేసుకుని “బీర్బల్ పొగాకును గాడిదలుకూడా తినడం లేదు”.

అంటూ బీర్బలు స్ఫురించేలా మందహాసం చేశాడు. పాదుషా తనను తాంబూలంలో పొగాకు వేసుకోవడాన్ని వెక్కిరిస్తున్నాడని గ్రహించుకున్నాడు బీర్బల్.

“చిత్తం జహాపనా! గాడిదలు పొగాకును ఎప్పుడూ తినవని”, ఎగతాళి చేస్తున్నట్లుగా అన్నాడు. పుగాకు తినని తనను గాడిదగా వివరిస్తూ యుక్తిగా ఎగతాళి చేసాడని గ్రహించి క్షణంలో తన నేర్పును చూపించిన బీర్బలన్ను అభినందించాడు.

25. రెండు గాడిదల బరువు |Akbar Birbal Stories in Telugu

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar Birbal Stories in Telugu

ఒకప్పుడు అక్బరు. బీర్బల్ కలసి సాయంసంధ్యలో విహరిస్తున్నారు – వారివెంట అక్బరుకుమారుడు కూడా ఉన్నాడు. వెళ్ళగా వెళ్ళగా వారికొక సుందర సరోవరం కనిపించింది.

చుట్టుమెట్లు కలిగి ఆ ప్రాంతం ఎంతోమనోహరంగా ఉన్నది. అక్బరుకుమారునకు ఆ సరోవరంలో స్నానం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతడు తన తండ్రికి తన అభిలాషను వివరించాడు.

పాదుషాకు కూడా స్నానం చెయ్యాలి అనిపించింది. వెంటనే తండ్రికొడుకులిద్దరు స్నానానికి సరోవరంలో దిగారు. వారి దుస్తులు బీర్బల్ని పట్టుకోమని ఇచ్చేరు.

ఒడ్డున తమదుస్తులు పట్టుకుని నిల్చున్న బీర్బల్న చూచి అక్బరుకు వేళాకోళం ఆడాలనిపించింది. “బీర్బల్. నీపై గాడిదబరువున్నది కదా!” అన్నాడు.

ఆ మాటలలోని పరిహాసాన్ని పసిగట్టిన బీర్బల్ వాటిని తిరగవేసి చెప్పి అక్బరునే పరిహసించాలని అనిపించి ఆ విషయం పైకి తేలకుండా “జహాపనా! క్షమించండి.

ఉన్నది ఒక్క గాడిద బరువు కాదు. ప్రభువులు పొరపడుతున్నారు. రెండుగాడిదల బరువున్న”దని వెటకారం చేశాడు. ఆ మాటలో అంతరార్ధాన్ని గ్రహించి, తానాడిన వెటకారానికి సిగ్గుపడి బీర్బల్ తెలివితేటలకు మిక్కిలి ఆనందించి అభినందించాడు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: