దర్దీవాడు – ఏనుగు | Telugu Neethi Katha for Students
దర్దీవాడు – ఏనుగు
ఒకఊిళ్ళో రహీమ్ అనే దర్జీవాడు ఉండేవాడు. అతడు దుస్తుల్ని చక్కగా వాడు. అందుచేత అతని, ‘దుకాణమెప్పుడూ.
జనంతో రద్దీగా ఉండేది. ఆ ఊళ్ళో ‘పెద్దదేవాలయమొకటి ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది. “దానిపై దేముళ్ళను బెట్టి పండుగ, దినాలలో ఊరేగించేవారు.
ఆ ఏనుగు ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి రహీమ్ దుకాణం ముందునుండే వెళ్తుందేది. రహీమ్‌కు ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది.
‘ప్రతీరోజూ దానికి ఏదో పండుగాని, చెణకు ముక్కగాని పెడ్తూండేవాడు. అది. అలవాటుగా మారి వేళతప్పకుందా ప్రతీసారీ వచ్చి అతని దుకాణంముందు నిలబడేది.
ఏదో ఒకటి అతను యిచ్చిన తర్వాతనే అక్కడినుండి వెళ్ళేది. ఒకరోజున రహీమ్ తనభాతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు. ఆ
రోజు అతని మనస్సు ఏమీ బాగోలేదు. పాపం! దానికి ఆ విషయాలేవీ తెలియవుకదా! ఏనుగు మాత్రం మామూలుగావచ్చి నిలబడింది.
ఎంతసేపైనా రహీమ్ దానికేదీ పెట్టలేదు. తనను చూడలేదేమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ‘ఘీంకరించింది.
దాని అరుపుకు చికాకుపడి రహీమ్ తన చేతిలోని సూదితో ‘దాని చెవిమీద గుచ్చేడు. దానికి చాలా బాధఅన్పించింది.
ఆ బాధతో అది “వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది. నదిలో స్నానంచేస్తూ రహీమ్‌కు బుద్ధిచెప్పడానికి ఒక ఆలోచనచేసింది.
తన తొండం నిండా మురికి నీళ్ళను పీల్చుకొని రహీం షాపువద్దకు వచ్చింది. వెంటనే ఆ బురదనీటిని అక్కడఉన్న కొత్తబట్టలపైనా, రహీంపైనా కూడా.
న్ కుమ్మరించి వెళ్ళిపోయింది. కై తానుచేసిన పనికి దానికి కోపమొచ్చిందని గ్రహించాడు రహీం. ఆ రోజు తర్వాతనుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నోవిధాల
‘ ప్రయత్నాలు చేశాడు. అరటిపళ్ళు, చెజకుముక్కలూ మొదలైనవి ఎన్ని పెట్టినా ‘అదిమాత్రం అతని స్నేహాన్ని యిష్టపడలేదు.
“చక్కటి స్నేహాన్ని చేతులారా పాడుచేసుకొన్నాను” అని రహీం తరచూ బాధపడేవాడు.
నీతి :- అమాయకులపై ప్రతాపం చూపరాదు.