Neethi katha in Telugu with Moral

పట్టుదల

ఒకసారి ఒకపెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒకరాజు, పెద్ద సైన్యంతో ఒకరాజు యుద్దం చేశారు. ఎవరిశక్తి కొలదీ వారు పోట్లాడారు. ఎత్తులకు పైఎత్తులువేసి ఎదుటి వాళ్ళని చిత్తుచేయాలని యిద్దరూ ప్రయత్నం చేశారు.

కాని పాపం! చిన్నసైన్యం ఉన్నరాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. వంటినిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తికూడా లేకపోయింది.

తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒకసాలీడు కన్పించింది.

అది క్రిందనుండి పైనున్న తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కాని అది క్రిందకు పడిపోతోంది. ‘ఒకసారికాదు అనేకసార్లు అది క్రిందపడి పోయింది.

అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తనగూటికి చేరుకొంది. దానిపట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది.

“NYSE నా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి” అని నిర్ణయించుకొన్నాడు. “ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి” అని గట్టిగా నిర్ణయించుకొని, మళ్ళీ ఆపెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు.

సైనికులకు తగిన శిక్షణనిచ్చుటచేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టికరపించారు. పెద్ద సైన్యంగల రాజే ఓడిపోయాడు. చిన్నరాజు విజేత అయ్యాడు. 68 :- జయం పొందాలంటే మళ్ళీమళ్ళీ ప్రయత్నించాలి ‘ఎదురైః

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: