Moral stories in Telugu PDF

1. దంబోద్భవుడు | Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

ఒకానొకప్పుడు సకల సంపదలకు నిలయమైన ఒకానొక రాజ్యాన్ని దంబోద్భవుడనే రాజు పాలించేవాడు. పరిపాలన ధర్మబద్ధంగా సాగేదే గాని, ఆయనలో మితిమించిన అహంభావం చోటు చేసుకున్నది.

భూలోక ప్రజలందరూ తనను గొప్ప రాజుగా గుర్తించి గౌరవించాలనే తహ తహ ఆయనలో పెరిగిపోయింది. సింహాసనంలో ఆనీ నుడు కాగానే, “మంత్రులారా! సేనాధిపతులారా! రాజప్రతినిధులారా! నాకన్నా శక్తి సంపన్నుడూ, గొప్పవాడూ ఈ భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చెప్పండి!” అని రోజూ అడిగేవాడు.

రాజాగ్రహానికి గురికావడానికి ఇష్టం లేని సభికులు, “లేరు ప్రభూ! లేరు! తమకు సాటి ఎవరూ లేనే లేరు!” అని ముక్తకంఠంతో ఘోషించేవారు.

రాజు సంతోషంతో పొంగిపోయేవాడు. కొన్నాళ్ళకు ఒక ముని ఆ రాజ్యానికి వచ్చాడు. రాజు ఆ మునిని కూడా అదే ప్రశ్న అడిగాడు. అందుకు ముని, “ఉన్నారు ప్రభూ! ఒకరు కాదు, ఇద్దరు!” అన్నాడు.

“నరనారాయణులు! గంధమాదన పర్వతం మీద ఉన్నారు. వాళ్ళే మానవులందరిలోకీ గొప్ప వాళ్ళు!” అని చెప్పి ముని వెళ్ళిపోయాడు.

ముని సమాధానానికి దిగ్భ్రాంతి చెందిన రాజు అమితావేశంతో సైన్యాన్ని వెంటబెట్టుకుని గంధమాదన పర్వతంకేసి బయలుదేరాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే, బక్కచిక్కిన ఇద్దరు మునులు శిఖరాగ్రం మీద కూర్చుని ధ్యాన నిమగ్నులై కనిపించారు. వాళ్ళను చూసిన దంబోద్భవుడు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు.

ఇంత దూరం వచ్చి వృధాగా తిరిగి వెళ్ళడం ఇష్టంలేక, వాళ్ళను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఫలించలేదు. ఆఖరికి వాళ్ళను పరుష పదజాలంతో దూషించసాగాడు.

అప్పటికి ఇద్దరు మునులలో ఒకడైన నరుడు మెల్లగా కళ్ళు తెరిచి, దావులనున్న దర్భ మొక్కనుంచి మూడు పోచలను తుంచి రాజు సైన్యం కేసి విసిరాడు. మరుక్షణమే సైనికులకు కళ్ళు పోయాయి.

వాళ్ళ రూపాలు కూడా మారిపోయాయి. మునులకున్న ఆధ్యాత్మిక శక్తి ముందు తన బలం తృణప్రాయమేనని దంభోద్భవుడికి అర్థమయింది. ఆయనలోని అహంకారం పటాపంచలయింది.

తన అపరాధాన్ని క్షమించమని మునుల పాదాలపై పడ్డాడు. నరనారాయణులు ఆయన్ను క్షమించి సైనికులకు మళ్ళీ దృష్టిని ప్రసాదించి, యధారూపాలు వచ్చేలా చేశారు.

ప్రజలను కరుణతో పరిపాలించాలనీ, మననులోని అహంభావాన్ని వినయంతో అదుపులో వుంచుకోవాలని రాజుకు బోధించారు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చి, అహంకార రహితంగా పరిపాలన సాగిస్తూ, ప్రశాంతంగా జీవితం గడిపాడు!

2. సుదోపసుందులు

Moral stories in Telugu PDF

వింధ్యాటవీ ప్రాంతంలో కుంభకుడనే రాక్షసుడొకడు వుండేవాడు. వాడికి సుందుడు ఉపసుందుడు అనే రాక్షస పుత్రులున్నారు.

వారిద్దరూ పెరిగి పెద్దయి తండ్రిలాగే ఋషులు, తపోధనులను ఏడిపిస్తుండేవారు. ఒక | రోజు ఒక ముని ఈ సోదరు లిద్దరినీ గాంచి “నాయనా! మీ దనుజ ధర్మం పాటిస్తున్నారు బాగానే వుంది.

ఏ | మహర్షి మీ ఆగడాలు చూసి శపించాడంటే మీరు శాప గ్రస్తులైపోతారు. అటువంటి దుస్థితి కలగకుండా వుండాలంటే | బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ఆయన్నుంచి విచిత్ర వరాలు పొందండి.” అని సలహా యిచ్చాడు.

ఆయన మాట ప్రకారం ఆ సోదరులు వింధ్యాటవిలో ఘోర తపస్సు ప్రారంభించారు బ్రహ్మకోసం! బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు.

నర, కిన్నెర, యక్ష, గంధర్వ, రాక్షస, క్రూర జంతులచే చావు లేకుండా వరమియ్యి; ప్రకృతి ప్రళయాలతో చావకూడదు, మాయంతట మేమే చావాలని కోరుకున్నారు.

వారు | అమరత్వం గూడా కావాలన్నారు. అవి అన్నీ విన్న బ్రహ్మ అమరత్వం మినహా అన్ని వరాలు ఇచ్చి వెళ్ళమన్నాడు. ఆ వర గర్వంతో ఆ సోదరులు విజృంభించి మునులను, తపోధనులను, యోగ్యులను, పండితులను, సత్సీలురను మరింత హింసలు పెట్ట సాగారు.

దేవతలను, దేవ కన్యలనుగూడా నానాబాధలు పెడుతున్నారు. వారంతా కలసి బ్రహ్మ వద్దకు వచ్చి “విధాతగారూ! వారి మంచి చెడ్డలు విచారించకుండా ఎవరేది కోరితే ఆ వరాలు ఇచ్చేసి మా ప్రాణం మీదకి తెచ్చావయ్యా….!

ఆ రాక్షస సోదరులైన సుదోపసుందులు బరి తెగించి రెచ్చిపోతున్నారు. వారి | పెట్టే బాధలు మేము భరించలేక పోతున్నాం. మాకేదైనా విముక్తి మార్గం కల్పించు” అని వేడుకున్నారు.

అంతట బ్రహ్మ తీవ్రంగా ఆలోచించి సృష్టిలో వున్న ప్రతి జీవిలోనుంచి ఒక తిలప్రమాణం మంచిని తీసి | భువనైక సుందరిని ఒకామెను సృష్టించాడు.

తిలప్రమాణంగా తీసుకున్న కారణంగా ఆమెకు తిలోత్తమ అని పేరుంచాడు. “తిలోత్తమా! నీవు దనుజ లోకంలోకి వెళ్ళి సుదోపసుందులనే ఇద్దరు సోదరులు వున్నారు.

వారిని మోహించు. వారిద్దరూ నిన్ను కోరతారు వారిలో ఎవరు యుద్ధం చేసి గెల్చి వస్తే వారిని నేను వివాహమాడతానని చెప్పు” అని పంపించాడు బ్రహ్మ.

తిలోత్తమ వెంటనే రాక్షస లోకం చేరి రాక్షసులు ముందు నృత్యం చేయ సాగింది. అలా తిరిగి తిరిగి చివరకు సోదరులైన సుందోపసుందుల వద్దకు వచ్చి నాట్యం చేసింది.

ఆమె నాట్యం చూసి యిద్దరూ మోజు పడ్డారు. “నన్ను పెళ్లాడు! కాదు నన్నే పెళ్లాడు” అంటూ సోదరులిద్దరూ తగులాడుకున్నారు.

“మీరు యిద్దరూ యుద్ధం చేసి ఎవరు గెలిచి వస్తే వారిని నేను పెళ్లాడుతాను!” అని షరతు పెట్టింది. తిలోత్తమ. అంతదాకా ఎంతో అన్యోన్యంగా వున్న సోదరులిద్దరూ ఈ అందగత్తె కోసం యుద్ధం మొదలు పెట్టారు.

త్వంలో, శూరత్వంలో ఒకరికొకరు తీసిపోరు. రెండు భయంకరమైన కొండలు ఢీ కొంటున్నట్లు పోరుసల్పారు వారిద్దరూ. ఒకరి మీద మరొకరు బండలు విసురుకున్నారు.

చెట్లు పీకి కొట్టుకున్నారు. ఆ విధంగా పది రోజులు నిర్విరామంగా పోరాటం జరిపి ఒడలంతా రక్తమయమైపోయింది. నీరసించి పోయారు వారు వారి పట్టుదల పెరిగిందేగానీ తరగలేదు.

తుదకు ముష్టి యుద్ధంతో ఒకరికొకరు తలపడి బలమైన ముష్టిఘాతాలతో కొట్టుకుని | ఒకర్నొకరు ఒక్కసారే చంపేసుకున్నారు! అంతట తిలోత్తమ సత్యలోకం వెళ్లి “విధాతా! మీరు నాకు యిచ్చిన కార్యం జయప్రదంగా ముగించాను!” అన్నది.

“భేష్ తిలోత్తమా! ఆ సోదరులిద్దరూ నీ కోసం పోరాడి ఒకర్నొకరు చంపుకున్నారు. మరొకరి వల్ల చావు లేకుండా వరమిచ్చాను.

ఆ వరం యిప్పుడు నెరవేరింది! నీవు స్వర్గలోకంలోకి వెళ్లి ఇంద్రుని దర్బార్లో నాట్య కళలను ప్రదర్శిస్తూ వుండు!” అని తిలోత్తమకు స్వర్గ వాసం కల్పించాడు బ్రహ్మ!

3. ప్రియా! నా గడ్డం లాగవా | Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

నేను ఏం చెబుతున్నానో పెళ్లికూతురు, పెళ్లికొడుకు సంతోషంగా పెళ్లి మాట వినిపించుకోవా! చేసుకుని ఇంటికి వస్తున్నారు.

“వారియా.. నా గడ్డం పట్టుకుని నువ్వు ఎంత గట్టిగా లాగలిగితే అంత గట్టిగా లాగ వోయ్!” అన్నాడు పెళ్ళికొడుకు పక్కనే ఉన్న అకస్మాత్తుగా అతనలా అడగడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

“ఇలాంటి తెలివి తక్కువ మాటలు నా దగ్గర మాట్లాడ కండి!” అంది నొచ్చుకుంటూ. “నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యి అంతే.. ఊఁ..

నా గడ్డాన్ని పట్టుకుని బలంగా “లాగు” లాగమని మీరెందుకు అంతగా పట్టుబడు తున్నారో నాకర్థం కావడం లేదు. ‘ “వారియా.. నేచెప్పేది వినిపించుకో నా గడ్డం పట్టుకుని లాగమని నిన్ను ప్రార్థిస్తు నాను.

నీకు నా మీద ప్రేమంటూ ఉంటే నా గడ్డాన్ని తప్పక లాగుతావు. ఇదిగో నా గడ్డం.. పట్టుకులాగు.” “మీ మాటల్ని నేను ఆమోదించను. ప్రాణా లకన్నా మిన్నగా ప్రేమించే వ్యక్తిని ఎలా బాధ పెట్టగలను? నేను అలా చేయను.”

“వారియా.. నిన్ను ప్రాధేయపడుతున్నా! నా నీకు అర్థమయిందా.. లేదా? అన్నాడు కోపంగా. ఇక తప్పదన్నట్టు పెళ్లికూతురు ఓ కృత్రిమ మైన నవ్వు నవ్వి అయిష్టంగానే అతని గడ్డం పట్టుకుని సాధ్యమైనంత గట్టిగా లాగింది.

భరించలేని నొప్పిగా ఉన్నా ఓర్చుకుని నవ్వడానికి ప్రయత్నిం చాడు. “చూశావా! నాకస్సలు నొప్పేలేదు. నీ ప్రేమమీద ఒట్టు.

నా ప్రియసఖీ! ఇక నీవంతు వచ్చింది” అంటూ ఆమె చెవులపైన వదులుగా వేళ్ళాడుతున్న కురుల్ని పట్టుకుని గట్టిగా పీకాడు.. అంతే..

వెళ్లి కూతురు బాధతో గట్టిగా అరి చింది. ‘ప్రియురాలా.. చూశావా! ఇప్పుడొక విష యం బోధపడింది. నీ కన్నా నాకు సహనం ఎక్కువేనని, ఎప్పుడైనా నువ్వు నన్ను చూసి పిడికిలి బిగించినపుడుగాని,

నావైపు కోపంతో గుర్రుగా చూసిన సందర్భంలోగాని ఈ సంగతి నువ్వు తప్పకుండా గుర్తుంచుకో. ఇలా చెప్పడం లోని ఉద్దేశ్యం ఏంటంటే భార్యకి భర్తే ప్రభువు. అలాగే క్రైస్తవానికి ఏసుక్రీస్తు, ఈ దేహాన్ని రక్షించేది కూడా ఆయనే.

4. నిజమైన భక్తి

Moral stories in Telugu PDF

ఒక కొండపైన ఆలయం ఉంది. అల యానికి వెళ్లే మార్గం చాలా కఠినంగా ఉండేది. ఒకరోజు, ఆలయ ప్రధాన పూజారి చనిపోయాడు.

ఆలయ నిర్వా హకులు కొత్త పూజారిని నియమిం చడం కోసం పరీక్షలు నిర్వహించారు. “క్షమించండి! నేను రావడానికి ఆలస్యం అయ్యింది.

నేను కూడా పూజారి అభ్యర్ధిని” అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు. “ఎందువల్ల ఆలస్యమైంది?” అని ప్రశ్నించారు పరీక్ష నిర్వాహకులలో ఒకరు.

“నేను ముందుగానే బయలు దేరాను. ఆలయానికి వచ్చే మార్గం. రాళ్లు రప్పలతో ఉండడం వల్ల రాళ్లు తీసివేసి వస్తున్నాను. దీంతో చాలా సమయం వృథా అయింది” అని చెప్పాడు యువకుడు.

అతని సమాధానం పూజారిని ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది. “నీకు పూజలు చేయడం వచ్చా?” ప్రధాన సభ్యుడు అడిగాడు.

“నేను నిత్య ప్రార్ధనలు చేస్తాను. విగ్రహాలను శుభ్రం చేయడం, గు వత్తులు ముట్టించడం, నైవేద్యం పెట్టడం వంటివి వచ్చు” సమాధాన మిచ్చాడు యువకుడు.”

“నీకు వేదమంత్రాలు తెలుసా?” మరొక సభ్యుడు ఆడిగాడు. “తెలియదు” అని చెప్పాడు. యువకుడు. సభ్యులు కాసేపు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

తరువాత ఆ యువ కుడినే ఆలయ పూజారిగా ఎంపిక చేస్తు న్నట్టు ప్రకటించారు. “ఏ ప్రార్థనైనా నిజమైన భక్తితో చేయబడితే అది వేదమంత్రాలతో సమానం.

నీకు వేద మంత్రాలు బోధించే ఏర్పాటు కూడా చేస్తాం” అని యువ చెప్పారు. సభ్యులు.

5. పని మనిషి | Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

“అమ్మా! మీకు పనిమనిషి కావాలని ప్రక్కవీధిలో చెప్పారు. అందుకే వచ్చాను. నేను బాగా పని చేస్తాను” అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో. “నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకొనేది.

సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో మాట్లాడుతాను” అన్నది అనసూయమ్మ. అలువేలు బట్టలు తీసుకుని సబ్బు నీళ్ళతో నానపెడుతుండగా, ఓ చొక్కా జేబులో ఐదు వందులు రూపాయల నోటు కనిపించింది.

ఆ నోటు తీసుకుని వెనక్కి తిరిగి చూసింది హాలులో అనసూయమ్మ టి.వి. చూస్తుంది. వెంటనే అలువేలు, ఆమె వద్దకు వెళ్ళి నోటును అందించి చెప్పింది.

అనసూయమ్మ సంతోషంతో, “నీ నిజాయితికి మెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి, నేను నీ గురించి నా మనసులో అనుకున్నది వున్నది, వున్నట్టుగా చెప్పదలచుకున్నాను.

మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితిగా వుంటావో, లేదో ప్రక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నీవు నిరూపించుకున్నావు.

నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు” అంటూ ఆమెను పనిమనిషిగా కుదుర్చుకుంది.

6. అమ్మ

Moral stories in Telugu PDF

అన్నపూర్ణమ్మ వయసు అరవైదాటింది. అత్తాకోడళ్ల అనురాగం ఆవిరైపోయింది. తల్లిని అదే వూర్లో వున్న వృద్ధాశ్రమంలో చేర్పించాల నుకున్నాడు కొడుకు అంకిత్, ఊర్లో ఖరీదైన వృద్ధా ఆనందాశ్రమం.

శ్రమం అక్కడికి అన్నపూర్ణమ్మను తీసుకెళ్ళాడు. అడిగిన అడ్వాన్సు చెల్లిం చాడు. మేనేజరు గది చూపించాడు. అది సింగిల్ బెడ్డూ, టీ.వీ. ఏ.సీ. అన్నీ వున్న సింగిల్ రూము.

తన తల్లీ ఏది కోరినా వెంటనే సమకూర్చమని మేనేజర్ని ఆదేశించాడు అంకిత్ అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది ఆమెకు. ఇంటిమీది మమకారం.

“బాబూ! అంకిత్ నాకు సూపర్ మార్కె ట్లో మూడడుగుల ఆడపిల్ల రబ్బరు బొమ్మను కొని పెట్టు’ అంది అన్నపూర్ణమ్మ, “ఏంటమ్మా వేళాకోళం బొమ్మతో ఆడుకునే వ నీది? >> *ఇంటి దగ్గర నీ కూతు రుండేది.

నేను దాన్ని విడిచి ఒక్క క్షణం ఉండ లేను. మీ భార్యాభర్తలి ద్దరూ నన్ను ఇంటినుండి గెంటేశారు. నీ కూతురి బదులు ఆడ పిల్ల బొమ్మ నా ఒడిలో దాచుకుంటాను.

స్నానం చేయిస్తాను. అందంగా అలంకరిస్తాను. పక్కలో పడుకోబెట్టి కథలు చెప్తూ హాయిగా నిద్రపోతాను” అంటూ కన్నీరు చీరకొం తుడుచుకుంది అన్నపూర్ణమ్మ.

అంకిత్ వెంటనే మార్కెట్లో మూడడుగుల ఆడపిల్ల బొమ్మను కొని తెచ్చి అమ్మకిచ్చాడు. అతని ప్రవర్తన చూసి ‘అమ్మ అల్లం, పెళ్ళాం బెల్లం కదా’ అనుకు న్నాడు ఆనందాశ్రమం మేనేజరు నిట్టూర్చుతూ.

7. ప్రియమైన శత్రువులు

Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

రామచంద్రరావు, సోమేశ్వర్రావు చూడటానికి స్నేహితుల్లా ఉంటారే కానీ లోపల్లోపల ఒక రంటే ఒకరికి ద్వేషం. ఒకరిని ఒకరు చెడగొట్ట డానికి ఎన్ని ప్లాన్లు వేసినా పైకి మాత్రం నవ్వుతూ ఏం తెలియనట్లు ఉండేవారు.

రామచంద్రరావు పరమ లోభి. అలాంటిది సోమేశ్వ రావుకు మాత్రం తన ఇంట్లో ఎవరిదో ఒకరిది పుట్టినరోజు, పండగ, అదని ఇదనీ ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి ఆహ్వానించి తీపి పిండివం టలు బతిమాలి మరీ తిని పించేవాడు.

సోమేశ్వరావు మహదానందంగా వచ్చి తినిపోయేవాడు. ఊళ్లో జనానికి వీళ్ల వ్యవ హారం ఒకపట్టాన అంతుపట్టేది కాదు. వీరిద్దరి వ్యవహారం అర్థంకాని వారిద్దరికీ మిత్రుడైన ఒకతను ఈ విషయం సోమేశ్వరరా వునే అడిగేశాడు.

“మీరెక్కడి స్నేహిత లండీ బాబూ! అతగాడికి మీరంటే సరిపోదు. మీకతడంటే సరిపోదు. మరి ఈ విందులేమిటీ? అని సోమేశ్వరావు నవ్వి పీనాసితనం అందరికీ తెలిసిందే!

వాడి సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి అందుకే తింటున్నా” అన్నాడు. ఆ మిత్రుడు రామచంద్ర రావునీ ఇదే ప్రశ్న వేశాడు.

రామచంద్రరావు పకపకా నవ్వి ‘సోమేశ్వరంగాడికి షుగర్ వ్యాధి ఎంత ఎక్కువగా స్వీట్లు తినిపిస్తే అంత త్వరగా ‘టపా’ కట్టేస్తాడు. అందుకే తినిపిస్తున్నా” అన్నాడు. ఉంది.

8. కపట స్నేహం

Moral stories in Telugu PDF

రామాపురానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. ఆ | అడవిలో జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి. అవి నీళ్ళు తాగడానికి అడవిలో ఒక వాగు కూడా ఉంది.

జిత్తులమారి నక్కకు ఒకరోజు అర్థరాత్రి బాగా | ఆకలైంది. తినడానికి ఏమైనా దొరక్క పోతుందా అని అడవిలో ఉన్న వాగు దగ్గరకు వచ్చింది.

అయితే, అక్కడ కొంగ | ఒకటి జపం చేసు కుంటూ కనపడింది. | నక్క కొంగ దగ్గరకు పోయి ఏంటి బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది.

అందుకు కొంగ జపం చేయడానికి ఇదే మంచి సమయం బావా అని సమా ధానం ఇచ్చింది. ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది.

ఒకరోజు మాఇంటికి రా బావా అని కొంగను పిలి చింది నక్క. సరే అని కొంగ ఒకరోజు నక్క బావ * ఇంటికి వచ్చింది. కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులూ కడుక్కోమంది నక్క.

చిట్టి కథ లోపలకు వచ్చిన కొంగకు పెద్ద పళ్ళెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది నక్క. వేడివేడిగా ఉన్న పాయ సాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలుకా లేదు.

దాంతో, కొంగకు నక్క బావ అతి తెలివి అర్థ మైంది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఎంతో ప్రేమగా నక్కను ఇంటికి రమ్మంది కొంగ. సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క.

బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళిచ్చింది కొంగ. పెద్ద పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది.

బావా నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఎత్తుగా ‘ సన్నటి మూతితో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరు కుంది నక్క.

కొంగ మాత్రం ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు నక్కకు గుర్తు వచ్చింది. ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది.

9. అహంకారం

Moral stories in Telugu PDF

జపాన్ దేశాన్ని టాంగ్ వంశీయులు పరిపాలిస్తున్న కాలంలో వారివద్ద ఒక గొప్ప రాజనీతిజ్ఞుడైన మంత్రి వుండేవాడు. సైనిక విషయంలో, పరిపాలనా విషయంలో అపారమైన మేధాశక్తి గలవాడు.

అన్ని వున్న ఆయన బౌద్ధ ధర్మాలను తు.చ. తప్పక పాటించేవాడు. ఒక గురువుగారికి సేవ చేసేవాడు. ఒకసారి ఆయన ఒక ఆచార్యుని సందర్శించాడు.

ఆయన బుద్ధుని బోధనలను దీక్షగా పాటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినవాడు. ఆచార్యునికి నమస్కరించి, “అయ్యా, బుద్ధ బోధనల ప్రకారం అహంకారం అంటే ఏమిటో వివరించండి” అని ప్రార్థించాడు.

అతడు అడిగిన దానికి ఆచార్యుని ముఖం ఎర్రబడింది. “ఏం ప్రశ్న అది? తెలివి తక్కువ “ప్రశ్న” అన్నాడు. అనుకోని సమాధానానికి మంత్రి మొదట నివ్వెరబోయాడు.

తర్వాత అతని నిర్లక్ష్యానికి విపరీతంగా కోపం వచ్చింది. కళ్ళు ఎర్ర బారాయి. ముఖం జీవురించింది. అతనిలో వచ్చిన మార్పును చూసి చిరునవ్వుతో ఆ ఆచార్యుడు, “అహంకారం అంటే ఇదే” అన్నాడు. మంత్రి సిగ్గుతో తలదించుకున్నాడు.

10. నిత్య సంతోషి

Moral stories in Telugu PDF

పూర్వం ఒక రాజు వుండేవాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, బలవంతుడూ. కానీ, ఆయన తన ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకునే వాడు కాదు.

కొన్నాళ్ళకు అతనికి జబ్బు చేసింది. దీంతో విచారగ్రస్థుడైన ఆ రాజు ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలనుకున్నాడు. ఎంతో మంది సుప్రసిద్ధ వైద్యులు వచ్చి అతణ్ణి పరీక్షించారు.

కానీ, ఎవరూ నయం చేయలేక పోయారు. రాజుకు కోపం వచ్చి వాళ్ళందరినీ కారాగా రంలో బంధించాడు. అలా ఉండగా వేరే దేశం నుంచి ఇద్దరు ఘన వైద్యులు వచ్చారు ఆయనకు చికిత్స చేయటా నికి మొదటి వైద్యుడు రాజును పరీక్షించాడు.

అతడు అంతగా తెలివితేటలు లేని వాడు. “అయ్యా! మీకు జబ్బు లేదు. మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. లేని జబ్బు ఉన్నట్టుగా ఊహించుకొని అనవసరంగా బాధపడుతున్నారు”.

అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. రాజుకు కోపం వచ్చి అతణ్ణి చీకటి కొట్లో వేయించాడు. అ చూసిన రెండో వైద్యుడు రాజుగారిని రకరకాలుగా పరీక్షించి, “అయ్యా మీరొక వింత వ్యాధి.

నిత్యం సంతోషంగా వుండే వ్యక్తి పాదరక్షలు. ధరిస్తే వెంటనే తగ్గిపోతుంది” అన్నాడు తెలివిగా. రాజు సంతోషించి అతనికి ఒక సంచినిండా బంగారం కానుకగా ఇప్పించాడు.

ఆ తర్వాత తన భటులకు “ఆ నిత్య సంతోషిని పట్టుకొని రండి” అని నలుమూలలా పంపించాడు. వాళ్ళు వెతకగా, వెతకగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే ఒక బిచ్చగాడు కనిపించాడు.

ఉన్న ఫలంగా అతణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు భటులు. “దయచేసి నీ చెప్పులు ఇవ్వు. దానికి బదులుగా నువ్వు కోరింది. ఇస్తా” అన్నాడు రాజు.

అందుకు బిచ్చగాడు “అయ్యా! నాకు నాదంటూ ఏదీ లేక పోవడం వల్లే నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు చెప్పులు కూడా లేవు” అన్నాడు నవ్వుతూ.

Also Check More Moral Stories

Also Read Akbar & Birbal Stories

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: