Friendship stories in Telugu | తెలుగులో స్నేహం కథలు
1. పిచ్చుక – కాకి | Friendship stories in Telugu
Friendship stories in Telugu
ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకుని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒకరాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది.
బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి. పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. “ఎవరూ?”
అంటూ లోపలి నుండి అడిగింది కాకి. “కాకమ్మా నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి.” అంది పిచ్చుక.
“అయితే నేనేం చేయాలి?” అంటూ ప్రశ్నించింది కాకి. “వర్షం ఆగేవరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు.” అంటూ ప్రాధేయపడింది పిచ్చుక. “నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నాయి.
నేను తలుపు తియ్యలేను” అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది కాకి. దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.
కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని “ఎవరు?” అడిగింది. “పిచ్చుకమ్మా నేను కాకిని. నా ఇల్లు వర్షానికి కూలిపోయింది.
నా పిల్లలు తడిచిపోతున్నాయి. దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంట్లో ఉంటాను.” అంది కాకి బయట నుంచి. పిచ్చుక వెంటనే తలుపు తీసింది.
కాకి పిల్లలను తన రెక్కలలో ముడుచుకుని లోపలికి తీసుకు వచ్చింది తన పిల్లల దగ్గర ఉంచింది. గతంలో పిచ్చుకతో తను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది.
2. ఆకలి కాయల పులుసు
Friendship stories in Telugu
మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంట వారిని నియమించాడు.
నాలుగు పూటలూ రకరకాల పంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదా నికి అర్ధం తెలియని రాజుకు రానురాను ఏ వంటకం రుచించకుండా పోయింది.
ఏదైనా అతిగా చేస్తే అంతేమరి! ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలు పెట్టాడు. ప్రసిద్ధిచెందిన వంటవారు పండినప్పటికీ, రుచిగా లేదని శిక్షించాడు.
అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడి ఆస్థానంలో పని చేసేవారే రాజుకు వంట చేయడా వంతులు వేసుకున్నారు.
వంటవారి కోసం రాజ్యమంతా వెతికినా భీమసేనుని తృప్తి పరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. నికి ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయ డానికి సిద్ధమయ్యాడు.
ఆస్థానానికి వచ్చినపుడు భీమసేనరాజు “ప్రపం చంలో నేను ఎన్నడూ రుచిచూడని వంటకాన్ని తయారు చేయగలవా?” అని అడిగాడు.
అప్పుడు ఆ యువకుడు “మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కాని ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి.
కోసిన వెంటనే వండాలి కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు” అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది.
ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలు పేరిన వాళ్ళు సాయంత్రం అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు.
రాజుకు చాలా ఆకలి వేయసాగింది. “ఇంకా ఎంత దూరం?” అని అడగడం మొదలు పెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియ కుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు.
“మహారాజా, ఇదే ఆకలి కాయల పులుసు” అన్నాడు. భీమసేనుడు ఆక లితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచిం చింది.
అలాంటి పులుసు తను ఎన్నడూ తినలేద న్నాడు. అప్పుడు యువకుడు “మహారాజా! ఇది మామూలు ఉల్లిపాయలు పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది.
ఆకలి లేని వారికి పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్న వారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది.” అని చెప్పాడు. రాజుకు పొరపాటు తెలిసివచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.
3. అందం-ఆనందం | Friendship stories in Telugu
Friendship stories in Telugu
ఒక ఊళ్లో ఒక కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్లు చేశాడు. మొదటి నాగలి నన్ను ఎవరికైనా అమ్మివేయి.
పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపతాను’ అంది. రెండో నాగలి మాత్రం ‘నన్ను ఎవరికీ అమ్మవద్దు. నీ దగ్గరే ఉంటాను. నేను పని మాత్రం తుప్పు పట్టి ఒక చేయలేను’ అంది.
అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగలిని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో నాగలిని తన శాలలో ఓ మూలన పడేశాడు. కొంత కాలానికి ఏదో పనిమీద రైతు నాగలి పట్టుకుని కమ్మరి దగ్గరకు వచ్చాడు.
ఆ నాగలి కొన్నప్పటికంటే తళ తళా మెరుస్తోంది. కమ్మరి దగ్గరే ఉన్న నాగలి మూలన పడి ఉంది. ‘మనమిద్దరమూ ఒకే ఇనుప ముక్క నుంచి తయారయ్యాం.
నేనేమో తుప్పు పట్టి ఇలా అధ్వానంగా ఉన్నాను. నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు ఎందుకు?’ అని అడిగింది. బదులుగా… ‘నా యజమాని నా రోజూ పొలం దున్ని నన్ను సానబెడతాడు.
కానీ నీకా అవకాశం లేదు. కాబట్టి ఎప్పటిలాగే ఉండిపోయావు. ఇప్పటికైనా పనిచేయడంలోనే అందం, ఆనందం ఉన్నాయని గ్రహించు’ అని చెప్పింది.
మొదటి నాగలి. ఆరోజే మూలనున్న నాగలి తనని కూడా ఎవరైనా రైతుకి అమ్మి వేయమని కమ్మరితో చెప్పింది.
4. జ్ఞానోదయం
Friendship stories in Telugu
కోశల రాజ్యంలోని ధనికుల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు. కేవవుడు ఏది కోరితే అది పరిచారకులు అందిస్తుం టారు.
దేనికీ లోటు లేకుండా అందరూ అతడిని బాగా చూసుకుంటుంటారు. కేశ పుడు ఒకరోజు తమ చుట్టుపక్కల గ్రామాలు చూడాలనుకుంటాడు. తండ్రి వద్దని వారించాడు.
కానీ ప్రతిరోజూ ధని కులు, వారి వారి పిల్లలో ఆడటం, తిరగడం. తప్ప గ్రామీణప్రాంతాల్లోనివారు ఎలా ఉంటారో తెలియదు. వారిని చూడాలని కేశ వుడు గట్టిగా నిర్ణయించుకుంటాడు.
ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడి పొలాలు, రైతులు, పనివాళ్లను చూసి ఆశ్చర్యమే స్తుంది.
నిత్యం పనిపాటలు చేస్తూనే ఉండడం అతన్ని ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కాని తినడానికేమీ లేదు, చేతిలో చిల్లి గవ్వ యినా లేదు.
అలా పొలం గట్టుమీద కూర్చు న్నాడు. అంతలో కొందరు రైతులు భోజనాలకు. ఒక చెట్టు కింద చేరారు. వారి వద్దకు వెళ్లి తనకూ కొంత పెట్టమని అడిగారు.
మరో ఆలోచనలేకుండా దయతో వాళ్ల దగ్గరున్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకుని కేశ వుదు మళ్లీ తాను దూరంగా వెళ్లాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తోంది తినడానికి పెట్ట మని అడిగాడు.
వాడు నిజం గానే ఆకలితో బాధపడుతు న్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్నదానిలో కొంత పెడదామని అనుకున్నాడు. గాని తన ఆకలి తీర్చుకోవ డానికి మొత్తం తినేశాడు.
అతను తిన్న పాత్ర రైతు కు ఇవ్వబోయాడు. అందులో రాసినదాన్ని చది వాడు. ‘పేదవారిని నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కే లేదు.
అని ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడ్డాడు. అంతే పరుగున తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు, తన దుస్తులు తెచ్చి ఆ బీదపిల్లవానికి ఇచ్చేశాడు.
5. విడిపోతే… ఓడిపోతారు | Friendship stories in Telugu
Friendship stories in Telugu
అనగనగా ఓ అడవి. ఆ అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఉండేవి. అడవి దగ్గ రున్న గ్రామానికి వెళ్లినా కలిసి వెళ్లి వస్తుండేవి. మేతకి వెళ్లినా, నీళ్లకోసం ఏటికి వెళ్లినా కలిసే వెళుతూండేవి.
ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడి పేవి. కొన్నాళ్లకు అవి ఉన్న ప్రాంతంలోకి ఒక పులి వచ్చింది. బలిసిన ఆవులను చూసి పులికి నోరూరింది.
కానీ వాటిని ఒక్కటిగా ఎదుర్కొ నడం కష్టమని గ్రహించింది. ఎంత ప్రయత్నించినా వాటి మధ్య విభేదాలు రావడం లేదు. పులిని దూరంగానే చూసి పోతున్నాయేగాని పలకరించడమైనా లేదు.
ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి కాస్తంత దూరం వెళ్లింది. అదను చూసి దాని దగ్గరికి పులి వెళ్లింది. ఇలా ఒకదాని వెంట ఒకటి తిరుగు తూంటే ప్రయోజనం లేదు.
లోకం చాలా విశాలమైంది. ఎన్నో వింతలు ఉన్నాయి. చూసి తమలాగా ఆనందించాలని, ఇలానే ఉండిపోతే జీవితం వ్యర్థమవు తుందని ఊరిస్తూ చెప్పింది.
పైగా ఎవరి ఆకలి వారిదిగాని ఒకరి ఆకలి కోసం మరొకరు అవస్థలు పడటంలో ‘ అర్థం చెప్పింది. అది విన్న ఆ ఆవు నిజమేననుకుంది.
మర్నాటి నుంచి మిగతా మూడింటికి కాస్తంత దూరంగానే ఉంటూ వచ్చింది. దాని పరిస్థితి తెలుసుకుని వాటిలో విభేదాలు తలెత్తాయి.
అంతే! కొద్దిరోజులకు నాలుగు ఆవులూ ఐకమత్యంతో ఉండక ఎవరి దారిన వారు తినడానికి, ఏటి దగ్గరికి నీటికోసం వెళుతున్నాయి. పులి వాటి స్థితిని గమనించి ఎంతో సంతోషించింది.
తన ఎత్తు పారిందను కుంది. ఏటి దగ్గరికి వచ్చిన దాన్ని వచ్చినట్టు మీదపడి చంపి తినేయడం మొదలెట్టింది. అందుకే అన్నారు…. చెప్పుడుమాటలు వింటే ఐకమత్యం దెబ్బతి టుందని.
6. రామయ్య ఆవు
Friendship stories in Telugu
రామయ్య దగ్గర ఒక ఆవు వుండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును ఎంతో శ్రద్ధగా మేత, కుడితి పెట్టి జాగ్ర త్తగా చూసుకునేవాడు.
అంతేగాక ఆవును దైవస్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి, పసుపు కుంకుమ లతో పూజ చేసి, హరతి ఇచ్చేవాడు.
ఆవు కొన్నాళ్ళకు దూడను ఈనింది. రామయ్య | ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింతగా.. పెరిగింది. కానీ ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతి కినా దొరకలేదు.
రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం దిగులుపడింది. నా దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి ఆవు తప్పిపోయింది.
దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను” అని దండోరా వేయిం చాడు. దూడకోసం ఆశపడిన గోపన్న అనేవ్యక్తి తన కోట్టంలో కట్టేసుకున్న ఆ ఆవును తీసుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు.
“ఆవును తెచ్చాను, దూడను కూడా ఇస్తే తీసుకుపో తాను” అన్నాడు. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక తన్ను తన్ని దూడ దగ్గరికి పరుగెత్తింది.
నడుము విరి గిన గోపన్న లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కి నందుకు, దూడకు తల్లికి దొరికినందుకు సంతోషించారు.
7. మంత్రదండం | Friendship stories in Telugu
Friendship stories in Telugu
పూర్వం మాళవరాజ్యాన్ని జయభద్రుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను మిక్కిలి సోమరి. ఎప్పుడూ చదరంగం మంత్రదండం ఆడుతూ కూర్చోవడం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్టనష్టాలను గురించి పట్టించుకునేవాడు కాదు.
రాజు సోమరి కావడంతో ప్రజలందరూ సోమరులుగానే తయారయ్యారు. ఎవ్వరూ ఏ పని చేసే వారు కాదు. దాంతో పంటలన్నీ ఎండి పోయాయి.
రాజ్యమంతటా దారిద్య్రం విలయతాండవం చేయ సాగింది. ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు. అప్పుడు జయభద్రుడు అర ణ్యానికి వెళ్లి భగవంతుడిని గురించి తపస్సు చేశాడు.
దేవుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన గానే “నారాజ్యంలో దారిద్య్రం పెరిగిపోయింది. ప్రజల కష్టాలు తీర్చడానికి నాకో మంత్రదండం కావాలి” అని ప్రార్థించాడు.
వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపో యాడు. జయభద్రుడు ఆనందంగా తిరిగివచ్చి “నా వద్ద ఒక అద్భు తమైన ఉంది.
దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను” అని ఊరంతా చాటింపు వేయించాడు. ఊరులోని ప్రజలందరూ బిలబిలలాడుతూ రాజసౌధం వద్దకు చేరుకున్నారు.
రాజు భటులను పిలిచి “ఇంకా రాని వాళ్లు ఎవరైనా వుంటే వెళ్లి పిలు చుకు రండి” అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్లగా ఒక చోట ఒకవ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు.
భటులు కళ్ళెర్ర చేసి, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతనిని రాజు వద్దకు ఈడ్చుకుని వచ్చారు. “కోరుకున్న వాళ్లకు కోరుకున్న పన్నీ మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు” అని రాజు ప్రశ్నించాడు.
అందుకా వ్యక్తి నవ్వి “రాజా! నా మంత్రదండం నాగొడ్డలే. దీంతో కట్టెలు కొట్టి, పొరుగూరికి తీసుకెళ్లి అమ్ముకుని, అక్కడినుంచి నాకు కావల్సిన ఆహారపదా ర్థాలు తెచ్చుకుంటాను.
నాకు హయిగా గడిచిపోతుంది. కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవ సరం లేదు” అన్నాడు వినయంగా.
అతని మాటలతో రాజు వాస్తవం గ్రహించాడు. తన చేతి లోని మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయం అయి పోయింది.
ఆనాటి నుండి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలం దరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరిసంపదలతో తుల తూగసాగారు.
నీతి: కష్టించి పని చేయడాన్ని మించిన మంత్రదండం లేదు.
8. దానం
Friendship stories in Telugu
ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టు బట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు.
అతడి. అవస్థకు జాలిపడి తన చేతిలోఉన్న పట్టు బట్టల్ని ఇచ్చేశాడు. మర్నాడు రాజు అటుగా వెళ్లిన ప తాను బహూకరించిన పట్టు బట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహూక రించాడు గురువు.
ఆ విషయం రాజుకు | తెలిసి వెంటనే గురువుని పిలిచి… ‘మీమీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే. వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచే యడం పద్ధతిగా లేదు’ అని కోపంగా • అడిగాడు రాజు.
బదులుగా… ‘దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నా రంటే, ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు.
ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగు తున్నారు కాబట్టి చెబుతున్నాను…. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను.
అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు’ అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ. కోరాడు రాజు.
9. మంచి మనసు
Friendship stories in Telugu
అనగనగా ఒక ఊరిలో చంద్రం అనే యువ కుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్లి ప్రతిరోజూ ఈత కొట్టి వస్తుండేవాడు.
అదే ఊరిలో ఉండే నాగరాజు అనే కుర్రాడికి, చంద్రానికి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎప్పుడు, ఎక్కడ ఒక ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు.
నాగరాజుకు ఈత రాదు. ఎలా గైనా చంద్రంలాగ తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవటానికి వెళ్లడం మొద లుపెట్టాడు.
ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్లాడు. ఆ రోజు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇంత ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టటం చాలా ప్రమాదం’ అను కుంటూ చంద్రం, అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు.
ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పటి లాగే చంద్ర నాగరాజు, కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నాగరాజు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుం దనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు.
నీరు వేగంగా ప్రవహిస్తుండ టంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో “రక్షించండి… రక్షించండి…” అని అరిచాడు.
ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు.
తనని చంద్రం కాపాడినందుకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు… చంద్రాన్ని అతని మిత్రుడు “నువ్వు, నాగరాజు గొడవ పడ్డారు కదా.
మరి అతన్ని రక్షించటానికి నీ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా నదిలోకి దూకావు. ఎందుకు?” అని అడిగాడు. అప్పుడు చంద్రం “నాకు ఈత వచ్చి కూడా నా కళ్ల ముందు ఈతరాని వాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక పోయాను.
ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే? అతన్ని రక్షించే అవ కాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది.
ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిముషాల తెగింపు నయం కదా! పైగా శత్రువు అయినా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచిమన సును మిత్రుడు అభినందించాడు.
10. నిజాయతీ
Friendship stories in Telugu
ఆ రోజు ఆఫీసుకని బయలుదేరాను. మా సందు చివర్లోనే ఓ అపార్ట్మెంట్ కడుతు న్నారు. దాని ముందుగా వెళుతూ రోడ్డుమీద ఐదువందల రూపాయల నోట్లు నాలుగు వర సగా పడుంటం చూశాను.
అక్కడే మెట్లపైన కూర్చునున్న వాచ్మాన్ ను అడిగాను నోట్లు ఎవరివని. “ఏమో..! నేను పడే వచ్చిన వి ఎవరివో అని సూత్తాండా? ” అన్నాడు.
వాటిని తీయకుంటే ఎవరిప అవుతాయని నోట్లను తీసి వాచ్మెన్ కిచ్చి ‘నువ్వు ఇక్కడే వుంటావు కదా ఈ డబ్బు పారేసుకున్నవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే..
ఎంత డబ్బు పోయిందో వాకబు చేసి నిజంగా పోగొట్టుకున్నవారికే ఇచ్చేయి’ అని హడావిడిగా బస్టాప్‌కు చేరుకు న్నాను. బస్సులో కూర్చున్న నాకు ఆ డబ్బు వాచ్మాన్ కాజేసి ఎవరోవస్తే ఇచ్చానంటాడు ఇదే జరగబోయేదనీ భావించాను.
ఆఫీసునుంచి మా కాలనీలోకి చేరుకునే బ సరికి రాత్రి ఏడు గంటలు అయింది. వాచ్మెన్ ఏం చెబుతాడో చూద్దామని ఆ అపార్టుమెంట్ దగ్గరకు చేరుకున్నాను.
టేఉన్న అతను “సారూ! పొద్దుగాల కెల్లి నే ఈడనే వున్న, ఈ ముంగటికెల్లి మస్తుమంది. వస్తుండ్రు పోతుండ్రుగాని ఈ పైసల కోసం ఎవ్వరు రాలే” అని ఆ రెండు వేలు నాకు తికి ఇవ్వబోయాడు.
నేను ఒక నిర్ణ వచ్చి అతన్ని వెంటబెట్టుకుని దగ్గరలోని సాయిబాబా గుడికి తీసుకె ళ్లాను. అక్కడున్న హుండీలో అతని చేతనే ఆ రెండువేల నీ రూపాయలు వేయించాను.
గుడిబయటకు వచ్చాక నా జేబునుండి వంద రూపాయల నోటు తీసి ‘ఇది నీ నిజా ఇస్తున్నా తీసుకో’ అన్నాను. “వద్దు సారూ” అన్నాడు సిగ్గుపడుతూ. ‘తీసుకో వయ్యా!’ అంటూ అతని చేతిలో పెట్టి ఎంతో ||తృప్తిగా ఇంటివైపు కదిలాను.