Balamitra moral stories | హితవు

హితవు

Balamitra moral stories

Balamitra moral stories: ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది.

నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరుగెత్తాయి.

తీరా అక్కడికి వెళ్ళి. చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరుగెత్తాయి.

ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. “నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది.” దీనంగా అది ఒక కోతి.

“ఏం చేద్దాం… నీళ్ళు కనబడుతు అందటం లేదు. న్నాయి. ఇదేమి మాయో…” అంది మరొక కోతి పొద ఒక కుందేలు నివాసం ఉంది. ఆ కుందేలు జరిగినదంతా చూసింది.

కోతులకు సహాయం చేయా లని వచ్చి వాటి ముందు నిలబడింది. “ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చు కోండి” అని చెప్పింది.

ఇది విని కోతు లకు చాలా కోపం వచ్చింది. “మేం తెలివితక్కువవాళ్ళమా?”. అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. “నేను చెప్పేది నిజం.

నా మాటలు నమ్మండి”. భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును. బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.

నీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: