Akbar and Birbal Tales in Telugu
16. తివాచీ మీద వున్న కానుక | Akbar and Birbal Tales in Telugu
Akbar and Birbal Tales in Telugu
సభాసదుల తెలివితేటలు తెలుసుకొవాలన్న ఆలోచన కలిగిందొకనాడు. అక్బరుపాదుషావారికి. దర్బారు సభాసదులతో నిండి ఉన్నది.
అధికారఅనధికారులు, మంత్రిసామంతులు, బీర్బల్ ఆందరు సముచిత ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. అక్బరు వారు నౌకర్లను పిలిచి ఒక తివాచీని తీసుకువచ్చి సభామధ్యగా వెయ్యమన్నారు.
వారలావెయ్యగా, ఒక వెండి పళ్ళెంలో రత్నాలు, బంగారు నాణాలు ఉంచి, ఆ పళ్ళెమును తివాచీకి మధ్యగా పెట్టించారు. సభాసదులారా! విజ్ఞులారా! ఆ తివాచీ మీద సువర్ణరత్నాలతో ఉన్న వెండిపళ్ళెం కొరకే ఏర్పాటు చేయించాను.
మీలో ఎవరైనా తివాచీ మీద నడచి వెళ్ళకుండా – ఆ పళ్ళెమును తీసుకొనవచ్చునన్నారు అక్బర్వారు. అటూ ఇటూ వెళ్ళకుండా, తివాచీని తొక్కకుండా, పళ్ళెమును తీసుకోవడం ఎల్లాగో తోచక ఎవరికివారు ప్రయత్నించకుండా ఊరుకున్నారు.
బీర్బలను ఉద్దేశించి నువ్వయినా తీసుకోగలవేమో ప్రయత్నించు అన్నారు. చిత్తం అని బీర్బల్ లేచి ఆ తివాచీవద్దకు వెళ్ళి దానిని చుట్టుతూ పళ్ళెంవరకు
వెళ్ళి దానిని తీసుకుని తివాచీని యధాప్రకారంగా ఎప్పటిలా ఉండేలా పరిచేశాడు. అక్బరు మరియు సభాసధులు ఆ పళ్ళెంతీసుకోవడంలో బీర్బల్ ప్రదర్శించిన బుద్ధిసూక్ష్మతను అభినందించారు.
17. గంట – ముసలిఎద్దు
అక్బరాదుషా తనపరిపాలనలో భాగంగా ఒకగంటను దర్బారుకు సమీపంలో కట్టించారు. కష్టమేదైనా కలిగినవారు ఆ గంటను మ్రోగిస్తే పాదుషావారు వచ్చి
వారికి కలిగిన కష్టనష్టాలను విచారించి తగిన న్యాయం సమకూర్చుతుండడం పరిపాటి. ప్రజలు దానిని “న్యాయగంట” అని ప్రశంసిస్తుంటారు.
ఒకనాడు ఒక ముసలిఎద్దు ఆ గంటవద్దకు వచ్చి తనకొమ్ములతో గంటకున్న త్రాటిని చుట్టబెట్టిలాగుతూ గంటను మ్రోగించసాగింది.
అక్బరుపాదుషావారు వచ్చి నోరులేని ఆ జంతువు గంటను లాగుతుండడం గమనించి దానికి కలిగిన బాధయేమిటో చెప్పలేదని దానికి ఏ విధమైన తీర్పును చెప్పలేక పోయేరు.
బీర్బల్‌ను పిలిచి ఆ ముసలిఎద్దు ఫిర్యాదేమిటో తెలుసుకొని తగిన తీర్పును ఇమ్మనెను. బీర్బల్ ఆ ఎద్దును గంటనుండి విడివడజేసి దానివెనుక కొంతమందినౌకర్లను పంపించేడు.
అది వెళ్ళివెళ్ళి తన యజమాని ‘ ఇంటిముందు ఆగింది. దానిని చూచి యజమాని, తన్ని తరిమేసినా తిరిగి ఇది ఇక్కడకే వచ్చినదని దానిని మరల తరిమి వేయబోయెను.
అదే దాని ఫిర్యాదుకు గల కారణమని గ్రహించిన రాజభటులు రాజాజ్ఞగా వానిని వెంటనిడుకుని బీర్బల్ వద్దకు తీసుకువెళ్ళారు. ఓయీ! దానిని ఎందువలన తరిమివేయుచుంటివని ప్రశ్నించెను.
మహాశయా! ఇది ముసలిదైపోయినది. పనిపాట్లు చేయలేక పోతున్నది. దీనిని పెంచుట వృధాదండుగ అని ఊరిలోనికి తరిమివేసాను అన్నాడు.
ఓయీ! అది వయసున్నప్పుడు ఎంతో కష్టపడి పనులు చేసింది. ఇప్పుడు ముసలిదైపోయిన దీనికి తిండి పెట్టకుండుట నీకు తగునా? అన్నాడు బీర్బల్.
మహాశయా! అక్కరకు ఉపయోగపడని దీనికి అలవిమాలిన ఖర్చు చేయుట నావల్లకాదు అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దజేసి, నీ ఇంటిలో వృద్ధులై ఉన్నారుగదా.
వారినికూడా తరిమివేయుదువా? అని అడిగాడు. వాళ్ళు నాకు జన్మనిచ్చి, నాకై శ్రమించిన వారినెట్లు తరిమివేయగలనని యజమాని అనగా.
నీ తల్లిదండ్రులవలె నిన్ను పెంపొందజేసిన ఆ ఎద్దును కూడా పోషించుట నీ విధి అని భోధించి ఎద్దును రక్షించెను. మూగజీవికి న్యాయము సమకూర్చిన బీర్బలు అక్బరువారు తగురీతిగా సత్కరించెను.
18. కాకుల లెక్క | Akbar and Birbal Tales in Telugu
Akbar and Birbal Tales in Telugu
ఒకప్పుడు అక్బరాదుషావారు, బీర్బల్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వారిమాటలు వారికే వినబడకుండా కాకులు దేవిడీచుట్టూ కావుకావుమంటూ అరవసాగాయి.
అక్బర్, బీర్బల్‌ను ఉద్దేశించి, కాకులిలా ఇంత ఇదిగా అరుస్తున్నాయి. కారణం యేమిటంటూ ప్రశ్నించారు. అవి అరుస్తున్నది ఆనందంవల్ల షెహన్షా, కాకులకు ఒక అలవాటుంది.
వాటికి ఎక్కడైన శుభం జరిగి రెండుమెతుకులు దొరుకుతాయంటే అవి తినడంతో | తృప్తిపడక ఇరుగుపొరుగుకాకులను పిలిచి, తమతోపాటు ఆరగించమంటాయి.
ఆ అలవాటు చొప్పున అవి ఆనందకోలాహలం చేస్తున్నాయి అన్నాడు బీర్బల్ – అయితే ఇంతకీ వాటికింత ఆనందంకలిగి తోటికాకులను పిలవడంలోని విశేషమేమిటి? అనడిగాడు అక్బరు.
ఏముంది మహాప్రభూ!. మీరు పరాకుపడినా ఈ రోజు మీ పుట్టినరోజని వాటికి గుర్తుండదు అన్నాడు బీర్బల్. అల్లాగునా, సరే జరిగినదేదో జరిగిపోయింది. దొరికినదానితో వాటిని తృప్తిపడని మనంవాటికి ఒక మంచిరోజు చూచి మంచి విందుచేద్దాం.
మన ఊళ్ళో కాకులెన్ని ఉన్నాయో లెక్క పెట్టించమన్నాడు. చిత్తం అని పలికి ఒకనాడు బీర్బల్ వచ్చి జహాపనా కాకుల్ని లెక్క పెట్టాను. మగకాకులు నాలుగువేలు. ఆడకాకులు నాలుగువేలు.
పిల్లకాకులు రెండువేలు ఉన్నాయన్నాడు. సరే వాటిని బోయిలచేత పట్టించి ఒకచోటకు చేర్చించు. కాకుల లెక్కలో తేడాపాడాలుంటే పదార్దాలు పొడవుతాయన్నాడు అక్బర్.
చిత్తం! తేడా ఉండడం సహజం. ఎందువల్ల నంటే మన ఇరుగుపొరుగు గ్రామాలకాకులతో మన ఊరికాకులకు చుట్టరికాలు ఉన్నాయి. ఇక్కడివి. అక్కడికి, అక్కడివి ఇక్కడికి రావడం పోవడం వల్ల తేడాలుండవచ్చు.
అని సమర్ధించుకున్నాడు తనకాకులలెక్కను బీర్బల్. వాని సమయోచితయుక్తికి అక్బర్ ఎంతగానో ఆనందించాడు.
19. దున్నపోతు
పాలు అక్బరాదుషావారి బీగమ్కు చాలా సుస్తీ చేసింది. వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఆ రోజు వైద్యుడికి ఒక చిలిపి ఆలోచన కలిగింది.
ప్రభువువారి ప్రేమాభిమానాలు చూరగొన్న బీర్బలు దెబ్బతియ్యాలన్న ఆలోచన కలిగింది. అక్బరువారివద్దకు వెళ్ళి జహాపనా! బీగమ్ గారికి వైద్యంచేయడానికి దున్నపోతుపాలుకావాలి. వీటిని సంపాదించడానికి బీర్బల్ ఒక్కడే సమర్ధుడు.
కనుక వానికి చెప్పి వెంటనే పాలు తెప్పించండి అన్నాడు. హకీం మాటలుకు ముందువెనుకలు ఆలోచించకుండా బీర్బల్‌ను పంపించి పాలుతేవాలన్న విషయం చెప్పిన వెంటనే తీసుకురావలసినదిగా ఆదేశించాడు.
ప్రభువులచిత్తం ఏది ఎటువంటిది అన్న, ఆలోచనలేకుండా ఆజ్ఞలు చేస్తుంటారు. ఈ పాలుఎక్కడైన సాధ్యపడతాయా. ఈపాటి విషయం కూడా ఆలోచించకుండా అనువుగా ఉన్నవారి మీద ఆజ్ఞలు జారీచేసేస్తారు.
ఇప్పుడీ ఉపద్రవాన్ని దాటి నెగ్గాలి అని బీర్బల్ తలపట్టుకు కూర్చున్నాడు ఇంటివద్ద. భర్తపరిస్థితిని చూచిన బీర్బల్ భార్య సంగతితెలుసుకుని విచారించకండి. తెల్లవారేసరికి మీ సమస్యను పరిష్కరిస్తానని భర్తను ఊరడించింది.
ఆనాటి అర్ధరాత్రి చెరువు గట్టుకువెళ్ళి బీర్బల్ భార్య బట్టలు ఉతకసాగింది. ఆ శబ్దం విన్న అక్బరు “ఎవరావిడ. ఇలాఅర్ధరాత్రి బట్టలుతుకుతున్నది. ఎందువల్ల? తెలుసుకురమ్మని” నౌకర్ని పంపించాడు.
ఆ నౌకరు వెళ్ళివచ్చి “జహాపనా! ఆమె భర్త ప్రసవించేడట అతని బట్టలు ఉతుకుతున్నదట” అని చెప్పాడు. “యేమిటి! భర్త ప్రసవించేడా?
ఈ వింత ఎక్కడైనా ఉందా! తెలుసుకుందామని” అక్బరు చెరువు గట్టుకు వెళ్ళి “ఏమిటమ్మా! మగవాడు ప్రసవించడమేమిటి? నువ్వు వానిబట్టలు ఉతకడ మేమిటి?”
అని ప్రశ్నించాడు. దున్నపోతు పాలివ్వగా మగవాడు ప్రసవించడంలో ఆశ్చర్యమేముంది అని బీర్బల్ భార్య ప్రశ్నించింది. అక్బరు తన పొరపాటును గ్రహించుకున్నాడు.
“అమ్మా! నువ్వు బీర్బల్ భార్యవేనా. కాకపోతే ఇంతటి చాతుర్యం మరెవరికుంటుంది. నీ భర్తకు మేము పొరపాటు పనిచెప్పాం అని క్షమించమన్నాడు. మర్నాడు సభలోజరిగిన విశేషమంతా చెప్పి క్షమార్పణ కోరుకున్నాడు అక్బర్.
20. నిజానికి అబద్దానికి ఉన్న దూరమెంత? | Akbar and Birbal Tales in Telugu
Akbar and Birbal Tales in Telugu
ఒకనాడు అక్బరాదుషాకు ఒక అనుమానం కలిగింది. అబద్దం నిజం ఒకదాని వెంబడి ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి కదా.
వీటికి మధ్యగల దూరమెంత? నిజం వెనుక అబద్దం, అబద్దం వెనుక నిజం, మసలుకుంటాయో గాని ఒకటున్నచోట మరొకటి ఉండబోదంటారు అదెంతవరకు నిజం అని అక్బరు బీర్బల్న ప్రశ్నించాడు.
జహాపనా! మీరు చెప్పినది సరైనదే. నిజం వెనుక అబద్దం – అబద్దం వెనుక నిజం ఉండలేదు. ఒకదానితో మరొకటి నిలవలేదు. రెండింటికి అంటే అబద్ధానికి నిజానికి గల మధ్యదూరం కంటికి చెవికి ఉన్నంతదూరం.
ఎందువల్లనంటే చూచింది నిజం, విన్నది అబద్దం. కన్ను – చెవి ఒకచోటకు చేరలేవు. అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బరాదుషా ఎంతో సంతృప్తిచెంది బీర్బలు సత్కరించాడు.