Akbar and Birbal Short Stories in Telugu
6. దేముడు చేయలేని పని | Akbar and Birbal Short Stories in Telugu
Akbar and Birbal Short Stories in Telugu
ఒకనాటి రాత్రిపాన్పుపై పరున్న అక్బరు పాదుషా వారికి ఒక ఆలోచన కలిగింది. దేముడు సర్వసమర్థుడు ఆయన చేయలేని పనంటూఉండదు. అట్లాగుననే తానుకూడా సర్వసమర్ధుడు.
తనకంటూ అసాధ్యమైన పనిలేదు. కాని సృష్టి మాత్రం తనకు అసాధ్యం. అల్లాగుననే భగవంతునకు అసాధ్యమైన పనేదయినా ఉన్నదా అని అనుమానం కలిగింది. ఎంతగా ఆలోచించినా అక్బరుకు కలిగిన ఈ శంక తీరలేదు.
మర్నాడు దర్బారులో యుక్తాయుక్తంగా బీర్బల్న ప్రశ్నించేడు అక్బరు. “బీర్బల్ నేను సమస్తమైన పనులను చేయగలవాడనుగదా! మరి నావలె భగవంతుడు అన్ని పనులు చేయగలడా?”
అని సగర్వంగా ప్రశ్నించేడు “చిత్తం తమరు సర్వసమర్థులు దేముడు మీకు సరిగాడు.. మీరు చేయగల పనులు కొన్ని ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదన్నాడు.
తనను అధికుడ్ని చేసిపలికిన బీర్బల్ పలుకులలో తాను చేసేది. భగవంతుడు చేయలేనిది యేమిటో తోచలేదు. తాను గ్రహించలేకపోయిన విషయం
వెల్లడికాకూడదన్న ఆసక్తితో బీర్బల్ నాకు మాత్రమే సాధ్యమయ్యే పనేమిటో తోచక తికమక పడుతున్న సభికుల సంశయాన్ని తీర్చు” అన్నాడు అక్బరు.
చిత్తం జహాపనా! సువిశాల ప్రపంచము అంతా ఆయనదే. తమకున్న సామ్రాజ్యమంతా తమదే. తమకు ఎవరి మీదనైనా అగ్రహంవస్తే తమరు తమ రాజ్యాన్ని విడిచిమరెక్కడికైనా పొమ్మని శాసించగలరు.
ఇది దేవునకు సాధ్యంకాదు – పరాయితావుకు తన జగత్తులో ఎక్కడికని పొమ్మనగలదు జహాపనా! మీరుచేయగల ఈపని దేవుడు చేయలేడు అని ప్రభువుకు జ్ఞానోదయమయ్యేలా సున్నితంగా వివరించాడు బీర్బల్.
7. వంకాయవంటి కూర
Akbar and Birbal Short Stories in Telugu
ఒకప్పుడు అక్బరాపాదుషావారి వంటవాడు లేతవంకాయలతో మషాలా పెట్టి గుత్తివంకాయకూర చేసేడు. అది తిన్న పాదుషావారు. దాని రుచికి పరవశించి పోయేరు.
తాను తిన్న వంకాయకూరను గురించి బీర్బల్క వర్ణించి, వర్ణించి, మరీ చెప్పాడు. వంకాయవంటిది మరిలేదయ్యా అని వంకాయను ప్రశంసించాడు పాదుషావారు.
నిత్యం ఆ కూరను వంటకాలలో మాకు చేసి వడ్డించమని చెప్పేరు. అంతబాగున్న కూరను నేనింతవరకు తినలేదు. రేపు నువ్వుకూడా వచ్చి మాతోపాటు వంకాయ కూరను రుచి చూడవలసినదన్నాడు.
ఆ మాటలకు బీర్బల్ పాదుషా వారిని ప్రశంసిస్తూ. జహాపనా! వంకాయ కూరగాయలలో సామ్రాట్టు అందువల్లనే “అల్లా” దానినెత్తిన టోపీ పెట్టి గౌరవించాడు” అన్నాడు.
అక్బరు వారం పదిరోజుల పాటుపంకాయ కూరతోనే భోజనం చేయడం. వంటవాడు తన పనితనానికి పాదుషావారు సంతృప్తిని పొందుతుండడంతో, మరింత జాగ్రత్తగా, మరింత రుచికరంగా వంకాయకూర రకరకాలుగా వండి
పాదుషావారికి వడ్డిస్తుండేవాడు. అలా పది పన్నెండు రోజులు గడిచేసరికి పాదుషావారికి దురదలు సంభవించాయి. వైద్యులను పిలిపించి మందు ఇమ్మని, కారణం యేమై ఉంటుందన్నారు. రోజూ ఆహారంలో వంకాయకూరను జతపర్చుకుని తినడమే కారణమన్నారు.
అక్బరు, బీర్బల్నుపిలిపించి వంకాయ సామ్రాట్టు కనుకనే అల్లాదానికి టోపీ పెట్టి మన్నించేడన్నావు. అది దుష్టమైన కాయగూరని వైద్యులు చెప్పారు. ఇప్పుడేమంటావు. అన్నారు.
అల్లాపెట్టిన టోపీతో విర్రవీగుతూ శృతిమించి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నందువల్లనే అల్లా దాని నెత్తిన మేకును దిగవేశాడని ముచ్చికను వర్ణించాడు. నిన్న మంచిదన్నావు.
ఇప్పుడు చెడ్డదంటూ నీ మాటను సమర్ధించుకుంటున్నావు యేమిటి అని అక్బరు బీర్బల్‌ను ప్రశ్నించాడు. “ప్రభూ! యధారాజా తధాప్రజా! ప్రభూ! అభిమతాన్ని మన్నించడం పౌరధర్మం.
మీరు బాగుందన్నప్పుడు నేనూ బాగుందనే అన్నాను. బాగోలేదనడంతో బాగులేదనక తప్పలేదు. మన్నించండి జహాపనా! అన్నాడు. బీర్బల్ మాటలకు అక్బర్ ఆనందించాడు.
8. గాలిమేడలు | Akbar and Birbal Short Stories in Telugu
Akbar and Birbal Short Stories in Telugu
ఒకరోజున అక్బర్, బీర్బల్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. “బీర్బల్! గాలిమేడలు అంటుంటారు. అవి ఎలా ఉంటాయి.
వాటిని కట్టడానికి ఎంత ఖర్చవుతుంది” అని ప్రశ్నించేడు. అక్బరాదుషా! “జహాపనా! గాలిమేడలు కట్టడం అందరికి సాధ్యపడే పనికాదు. కొందరికీ గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది.
సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గుర్తించడం కూడా కష్టం” అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బరాదుషా తనకు గాలిమేడలు చూడాలని ఉన్నదని.
పనివారిని రప్పించి కట్టించవలసినదని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించేడు. సరే పాదుషావారి ఆజ్ఞమేరకు గాలిమేడలు కట్టించుతాను. వాటికి పునాదులు గోడలు ఉండవు.
ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు. ఎన్ని అంతస్తులు కట్టించనుఁ అన్ని అంతస్తులు కట్టగలవారిని రప్పించి మేడలు ఆరుమాసాల్లో కట్టిస్తానన్నాడు.
ఆ తర్వాత బీర్బల్ పాదుషావారి దర్శనానికి రావడం మానివేశాడు. బీర్బల్ రాకపోవడంతో అక్బరుకు కాలక్షేపం జరగక కబురుచేసారు. పనివాళ్ళకోసం తిరుగుతున్నాను.
వారు దొరకగానే మీ దర్శనానికి గాలిమేడలతో పాటు వస్తానని సమాధానం పంపించేడు. అనుకున్న ప్రకారం ఆర్నెల్ల కాలంగడచిపోగా బీర్బల్ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి. ఒకవ్యక్తిని తీసుకొని వచ్చేడు.
ఏమయ్య బీర్బల్! గాలిమేడల నిర్మాణం ఎంతవరకు వచ్చింది”. అని ప్రశ్నించాడు అక్బరాదుషా! ప్రభువులవారు సావధానంగా ఉంటే గాలిమేడల దర్శనం జరుగుతుంది.
ఇతడే గాలిమేడలు నిర్మాణంలో ఎంతో ప్రవీణుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమును కోరి యున్నందున మీ తావునకు తీసుకువచ్చాను. కొద్ది క్షణాలు మీరితనితో మాట్లాడినచో వీనికి గల ప్రావీణ్యత అవగతమౌతుంది”. అన్నాడు బీర్బల్.
“నువ్వు చాలా ప్రవీణుడవని బీర్బల్ చెబుతున్నాడు. నీది యే ఊరు? నీ తల్లితండ్రులెవరు? నువ్వేం చేస్తుంటావు?” అని అక్బర్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. “జహాపనా! ఏమని చెప్పను.
చాలా చరిత్రగలిగిన సమర్ధుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగేరు. మా స్వగ్రామమైన బర్కల నగరుకు తరచుగా పహిల్వానులు వచ్చేవారు.
వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాడ్ని. నాపేరు చెబితే మల్లయోధులు మాఊరువచ్చేవారేగాడు. ఇరుగుపొరుగు రాజులు | నాకీర్తివిని నన్ను తమవద్దకు పిలిపించుకొని, కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు.
ఆ కానుకలతో నేనే నా తల్లితండ్రులను పెంచేవాడ్ని. ఒక్క మల్లవిద్యతోనే గాక ఇంకా అనేక విద్యలలో పేరుకీర్తులందుకున్నాను.
తమవంటి ప్రభువులను ఆశ్రయించి, వారికి రక్షకుడిగా, వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించగలచతురుడను. మిమ్మల్ని ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి, ఆ జాగీరుకు నా తండ్రిని సుల్తానుని చేసి, వారి అంగరక్షకుడుగా నుండి మరొకటి మరొకటిగా జాగీర్లు సంపాదించుకుని, తమవంటి వారి
స్నేహ సౌశీల్యాదులతో వర్ధిల్లగల సమర్ధత కలిగినవాడను. అంటూ ఇంకాయేమేమొ చెబుతున్న అతనిని బీర్బల్ ఆపుచేశాడు.
విన్నారుకదా ప్రభూ గాలిమేడలు కట్టడంలో ఇతనికి అతనేసాటి. గాలిమేడలకు నివేశనస్దలం – పునాదులు కిటికీలు అక్కరలేదు అన్నాడు. గాలిమేడల నిర్మాణం వివరించడానికే ఈ గాలిమేడల శిల్పిని మీ వద్దకు తీసుకువచ్చేను.
ఆశమీద ఆశ, ప్రగల్బాలమీద ప్రగల్బాలు, పేర్చి రమ్యమైన ఊహలు నిర్మించుకుని వాటిలో ఆకాశపధంలో ఊరేగడం ఈ గాలిమేడలు కట్టేవారిపని. ఆశల పేర్పు – ప్రగల్బాల నేర్పు.
ఊహలల్లుకోవడంలో ఓర్పు ఎదుటివారిని గమనించకుండా పొల్లుమాటలతో వట్టిమాటలతో బ్రతికేవారి పనే గాలిమేడలు కట్టడం జహాపనా! పొల్లు కబుర్లు స్థిరం లేని ఆశలు.
యుక్తాయుక్తాలు తెలియని డాంబికాలే గాలిమేడలు. సమర్ధతను గుర్తెరుగకుండా, సాధ్యాసాధ్యాలను గమనించుకోనట్టి వారి కల్పనా జగత్తులోనివే గాలిమేడలు” అని వివరించాడు బీర్బల్.
9. మనిషికన్నా కుక్కమిన్న
అక్బరుపాదుషావారు సభాసదులను ఉద్దేశించి “సభికులారా! విశ్వాసము అవిశ్వాసము అంటుంటారు. ఏమిటది?” అని ప్రశ్నించెను. చేసినది- పెట్టినది, ఇచ్చినది స్వల్పమే అయినా గుర్తు కలిగి ప్రవర్తించడం విశ్వాసం అనబడుతుంది.
ఆ విధంగా కాకుండా, ఇంకా ఇచ్చేరు కాదు, అని చేసిన మేలును మరచిపోయి ప్రవర్తించడం అవిశ్వాసం అనబడుతుంది” అని వివరించాడు బీర్బల్. ‘అందుకు ఇందుకు చెప్పుకోదగ్గ వారెవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు అక్బరు.
లేకేం పాదుషా విశ్వాసానికి పెట్టింది పేరు శునకం – పెట్టింది స్వల్పమే అయినా! ఒకసారి తిన్నశునకం ఎల్లకాలం పెట్టిన వారి పట్ల గుర్తు కలిగి ఉంటుంది.
వారికిగాని వారి ఇంటికిగాని యే విధమైన ఇబ్బంది కలుగకుండా గుర్తు కలిగి ప్రవర్తిస్తుంది. మనిషి తనకు. ఇచ్చింది ఎంతయినా, చేసినమేలు ఎంతటిదైనా కృతజ్ఞత చూపకపోగా, కపటప్రేమను అభినయిస్తూ,
మరింతగా తనను ఆదరించలేదని అలుగుతాడు – వారిక్షేమం కోరడం మాట అటుంచి, తన ప్రయోజనం కోసం ఎట్టి చెడును చెయ్యడానికైన
వెనుకాడడు. నరుని కన్నా విశ్వాస హీనుడు మరి ఉండబోడు. మీరు అంగీకరిస్తే రేపటిరోజున విశ్వాసం – అవిశ్వాసం కలిగిన వారిని తమ సమక్షంలో నిలబెడతాను” అన్నాడు.
ఆ మర్నాడు అతనొకకుక్కను – ఒక వ్యక్తిని తీసుకుని సభకు వచ్చేడు. జహాపనా! ఇది నా వీధిలో తిరుగాడే కుక్క దీనికి అప్పుడప్పుడు శేషపదార్ధాలను పెడుతుంటాము –
మా ఇంటివద్దనే ఉంటూ మమ్మల్ని మా క్షేమాన్ని కోరుతూ మసలు కుంటుంది. అని చెప్పి దానిని నానుండి వెడలగొట్టమని సేవకులకు ఆజ్ఞాపించండి, నిదర్శనం మీకే తెలుస్తుందన్నాడు.
రాజభటులు దానిని వానినుండి తరమబోగా అదివారిమీద తిరగబడి తరిమి మళ్ళీ బీర్బల్ దగ్గరకి వచ్చి కూర్చున్నది. వెంట తీసుకువచ్చిన మనిషిని ముందుకు పిలిచి, సార్వభౌమా ఇతడు మా ఇంటి ప్రక్కవారి అల్లుడు ప్రతీయేటా ఇతడ్ని పిలిచి చీని చీనాంబరాలు, కట్నకానుకలు ఇచ్చి మర్యాద చేస్తుంటాడు మామగారు.
అతనికి ఈ యేడాది మామగారు యేమిచ్చారో అడగండి? అన్నాడు. ఏమయ్యా! మీమామగారు ఈ సంవత్సరం నీకు యేమిచ్చాడు? అని ప్రశ్నించాడు అక్బరు. ప్రభూ ఇచ్చాడు. పెట్టుపోతల మొక్కుబడి తీర్చుకున్నాడు.
కట్నకానుకల విషయంలో మామగారంత పిసినారి మరొకరుండడం, ఈ స్వల్పానికి మమ్మల్ని రమ్మనడం – మాకు ఖర్చులు కలిగించడం దేనికండి. ఆపాటి కట్నకానుకలు నేరుగా పంపించవచ్చుగదా.
మేమురావడం దేనికి? అంటూ మామగారు చేసేపనులను దెప్పిపొడుస్తూ, మరింత చెప్పడంతో అక్బరుపాదుషా వారికి అర్ధమయ్యింది మనిషి ఎంత స్వార్ధపరుడో తెలిసింది.
కుక్కను మించిన విశ్వాసం గల జీవి మనిషిని మించిన విశ్వాసహీనుడు మహినుండరన్నది తెలిసేలా చేసి చెప్పిన బీర్బలన్ను అక్బర్ పాదుషా పొగిడాడు.
10. ప్రతిపువ్వు | Akbar and Birbal Short Stories in Telugu
Akbar and Birbal Short Stories in Telugu
పువ్వులలో యే పువ్వుగొప్పదో తెల్పవలసినదని అక్బరు పాదుషా ఒకనాడు సభాసదులను ప్రశ్నించెను. గులాబీ అని కొందరు – మల్లె అని కొందరు. సంపెంగ అని కొందరు ఇలా తలా ఒక విధంగా వర్ణించారు.
నువ్వేమంటావు బీర్బల్ అని అక్బరువారు బీర్బల్‌ను ప్రశ్నించారు. “జహాపన! మన సభికులు చెబుతున్నట్టు యే పువ్వుకు ఆ పువ్వేగొప్పది. కాని అవన్నీ అలంకరణకు, వినియోగానికి గొప్పగా ఉపయోగపడుతున్న పువ్వులే.
కాదనను, అవిలేనందువల్ల మనకు అవిలేని కొరతగాని కష్టము. నష్టము యేమీఉండదు. నన్నడిగితే వీటన్నిటికన్నా గొప్ప పువ్వు ప్రత్తిపువ్వు అన్నాడు బీర్బల్. ఎందువల్ల అని ప్రశ్నించేడు అక్బర్.
ప్రతిపువ్వు వల్ల ప్రత్తి – ఆ ప్రత్తినుండి నూలు – ఆ నూలుతో వస్త్రాలు తయారౌతుంటాయి. ఆ వస్త్రాలు మనకు మానసంరక్షణకు సొగసుకు శోయగానికి తోడ్పడతాయి.
ప్రత్తిపువ్వులేకపోతే మనం అనాగరికులుగా దిగంబరులుగా ఉండిపోతే మానసంరక్షణలేని ఆటవికులుగా మసలుకోవలసి ఉండేది. ఆ సమాధానం అక్బరువారికేగాక సభాసదులందరి మన్ననలు పొందింది.